Telugu Global
Cinema & Entertainment

నైజాంలో రికార్డు సృష్టించిన రామ్

రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా యావరేజ్ గా ఉంది. కాకపోతే కామెడీ వర్కవుట్ అవ్వడం, దసరా సీజన్ కావడంతో థియేటర్లలో నడిచిపోతోంది. ఇందులో భాగంగా తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రామ్. అది కూడా నైజాంలో కావడం విశేషం. అవును.. నైజాంలో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రామ్. ఇతడు నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా ఫస్ట్ వీకెండ్ లో నైజాంలో 5 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ అందుకుంది. […]

నైజాంలో రికార్డు సృష్టించిన రామ్
X

రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా యావరేజ్ గా ఉంది. కాకపోతే కామెడీ వర్కవుట్ అవ్వడం, దసరా సీజన్ కావడంతో థియేటర్లలో నడిచిపోతోంది. ఇందులో భాగంగా తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రామ్. అది కూడా నైజాంలో కావడం విశేషం.

అవును.. నైజాంలో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రామ్. ఇతడు నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా ఫస్ట్ వీకెండ్ లో నైజాంలో 5 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ అందుకుంది. రామ్ కు సంబంధించి ఇదే హయ్యస్ట్. ఇంతకుముందు రామ్ నటించిన సినిమాలేవీ ఇలా ఫస్ట్ వీకెండ్ లో నైజాంలో ఇంత కలెక్ట్ చేయలేదు.

మరోవైపు ఇదే సినిమాతో వరల్డ్ వైడ్ 20 కోట్ల గ్రాస్ కూడా అందుకున్నాడు రామ్. ఈ హీరోకు సంబంధించి ఫస్ట్ వీకెండ్ లో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి వారాంతం (4 రోజులు) వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 5.56 కోట్లు
సీడెడ్ – రూ. 2.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.89 కోట్లు
ఈస్ట్ – రూ. 0.92 కోట్లు
వెస్ట్ – రూ. 0.63 కోట్లు
గుంటూరు – రూ. 1.38 కోట్లు
కృష్ణా – రూ. 0.90 కోట్లు
నెల్లూరు – రూ. 0.45 కోట్లు

First Published:  23 Oct 2018 10:11 PM GMT
Next Story