లక్ష్మీ పార్వతి పాత్రలో ఆమని

నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుంచి డైరెక్టర్ తేజ ని తప్పించి క్రిష్ ని డైరెక్టర్ గా తీసుకున్నాడు బాలక్రిష్ణ. ఈ సినిమాని రెండు భాగాలు తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతీ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ఆమనిని సంప్రదించాడు బాలక్రిష్ణ. ఆమని కి కూడా ఆ పాత్ర నచ్చి వెంటనే ఓకే చెప్పిందట. సినిమా కథనం విషయంలో అలాగే సినిమాలో నటించే నటీనటులు విషయంలో బాలక్రిష్ణ ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నాడు.

ఎం.బి.కె ఫిల్మ్స్ పై బాలక్రిష్ణ సాయి కొర్రపాటి తో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ బయోపిక్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క మొదటి భాగం జనవరి 9న రెండో భాగం జనవరి 24 న రిలీజ్ కానుంది.