Telugu Global
NEWS

అరవింద సమేత ఫ్యాక్షన్‌ను సమర్ధించిన రామకృష్ణ

రాయలసీమలో లేని ఫ్యాక్షన్‌ను చూపిస్తూ బయటి ప్రపంచాన్ని సినిమా వాళ్లు భయపెడుతున్నారని…. అందుకే సీమలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నది వాస్తవమే. ఈ కోణంలో అరవింద సమేత చిత్రాన్ని రాయలసీమ వాసులు తప్పుపడుతుంటే సీపీఐ రామకృష్ణ మాత్రం సినిమాను సమర్ధిస్తున్నారు. రామకృష్ణ కూడా రాయలసీమ వ్యక్తే. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అరవింద సమేత చిత్రంలో రాయలసీమను కించపరిచేలా అంశాలు లేవన్నారు. అదో సందేశాత్మక చిత్రం అని చెప్పుకొచ్చారు. అసలు ఆ సినిమాలో […]

అరవింద సమేత ఫ్యాక్షన్‌ను సమర్ధించిన రామకృష్ణ
X

రాయలసీమలో లేని ఫ్యాక్షన్‌ను చూపిస్తూ బయటి ప్రపంచాన్ని సినిమా వాళ్లు భయపెడుతున్నారని…. అందుకే సీమలో పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదన్నది వాస్తవమే. ఈ కోణంలో అరవింద సమేత చిత్రాన్ని రాయలసీమ వాసులు తప్పుపడుతుంటే సీపీఐ రామకృష్ణ మాత్రం సినిమాను సమర్ధిస్తున్నారు.

రామకృష్ణ కూడా రాయలసీమ వ్యక్తే. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అరవింద సమేత చిత్రంలో రాయలసీమను కించపరిచేలా అంశాలు లేవన్నారు. అదో సందేశాత్మక చిత్రం అని చెప్పుకొచ్చారు. అసలు ఆ సినిమాలో ఫ్యాక్షనే లేదని చెప్పారు. అరవింద సమేతలో ఫ్యాక్షన్ లేదని రాయలసీమవాడినే అని చెప్పుకునే రామకృష్ణ ఇప్పుడు తీర్మానించడం వెనుక ఒక కారణం ఉంది. నిన్ననే బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి రాయలసీమను కించపరిచేలా ఉన్న అరవింద సమేతా చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలు ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలన్నది రామకృష్ణ సిద్ధాంతం అయి ఉండవచ్చు. కానీ రాయలసీమ ప్రాంతానికే చెందిన రామకృష్ణ…. అరవింద సమేతా చిత్రానికి క్లీన్‌ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఈ ప్రాంత ప్రజలకు కొన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాయలసీమ వాసులు, మేధావులు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

అరవింద సమేత చిత్రంలో ఈ నేల కత్తి పట్టమంటుంది అని ఒక డైలాగ్ ఉంది. ఇప్పటి వరకు రామకృష్ణను ఎప్పుడైనా రాయలసీమ నేల కత్తి పట్టమని సూచించిందా?. కనీసం కత్తి పట్టు అనిచెప్పే నేల ప్రపంచంలో ఉంటుందా?. రాయలసీమ డీఎన్‌ఏలో వైలెన్స్ ఉంది అన్న డైలాగ్ కూడా ఉంది. రాయలసీమలోనే పుట్టిన రామకృష్ణ డీఎన్‌ఏలోనూ వైలెన్స్ ఉందా? అని నిలదీస్తున్నారు.

అరవింద సమేత చిత్రంలో గాట్ల ముఖంతో జగపతి బాబు గెటప్‌ అడవి మనిషి తరహాలో ఉంటుంది. తాను పుట్టిన రాయలసీమలో అలాంటి గెటప్‌లతో ఎవరైనా తిరగడం రామకృష్ణ చూశారా?. ఒక మనిషి…. పదుల సంఖ్యలో మనుషులను నరికేసి ఆ కత్తి రక్తాన్ని తొడలకు రాసుకోవడం ఎక్కడైనా రామకృష్ణకు కనిపించిందా? అని రాయలసీమ మేధావులు ప్రశ్నిస్తున్నారు.

రాయలసీమలో ఇంకా ఫ్యాక్షన్ బుసలుకొడుతోందని రామకృష్ణ బయటి ప్రపంచానికి చెప్పగలరా? కనీసం రాయలసీమలో సినిమాల్లో చూపినట్టు ఎవరైనా తొడలు కొడుతున్నారా? రాయలసీమ నీళ్ళు తాగగానే నరాలు రంగు మారడం, పౌరుషం పుట్టుకు రావడం వంటివి సినిమాల్లో చూపినట్టు రాయలసీమలో జరుగుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  23 Oct 2018 7:18 PM GMT
Next Story