Telugu Global
NEWS

కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ నయా ప్లాన్ ఇదే..

ఎన్నికల్లో విజయానికి ఒక్కో మెట్టును కూడగడుతున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఉత్తర తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఇక్కడి ఐదు జిల్లాల్లో 54 నియోజవకర్గాలు ఉంటే, 44 సీట్లు కైవసం చేసుకున్నారు. ఈ సారి మొత్తం తమ ఖాతాలో వేసుకుని ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణను క్లీన్ స్వీప్ చేసి అధికారం కొల్లగొట్టాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షిణ తెలంగాణ కంటే ఉత్తర తెలంగాణపైనే ఫుల్ ఫోకస్ […]

కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ నయా ప్లాన్ ఇదే..
X

ఎన్నికల్లో విజయానికి ఒక్కో మెట్టును కూడగడుతున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఉత్తర తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఇక్కడి ఐదు జిల్లాల్లో 54 నియోజవకర్గాలు ఉంటే, 44 సీట్లు కైవసం చేసుకున్నారు. ఈ సారి మొత్తం తమ ఖాతాలో వేసుకుని ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణను క్లీన్ స్వీప్ చేసి అధికారం కొల్లగొట్టాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షిణ తెలంగాణ కంటే ఉత్తర తెలంగాణపైనే ఫుల్ ఫోకస్ పెట్టారట.

టీఆర్ఎస్ కు కీలకమైన ఉత్తర తెలంగాణాలో కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఉద్యమ నేపథ్యం ఉన్న ఈ జిల్లాల్లో టీఆర్ఎస్ కు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో 64 సీట్లు గెలిస్తే ఉత్తర తెలగాణ నుంచే 44 సీట్లు వచ్చాయి. అంటే దాదాపు 80 శాతానికిపైగా సీట్లు పొందిందన్నమాట. ఈసారి 50కి పైగా ఇక్కడి నుంచి గెలవాలని టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

కరీంనగర్ లో మొత్తం 13 స్థానాలు ఉంటే ఒకటి మినహా అన్ని స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి మాత్రమే గెలిచారు. ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మిగతా నాలుగు జిల్లాల్లోనూ గులాబీ శ్రేణులకు ఇప్పటి వరకు అనుకూల పవనాలే వీస్తున్నాయి.. ఆ అనుకూలతను నిలబెట్టుకుంటే విజయం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి.

నిజామాబాద్ క్లిిన్ స్వీప్ చేసింది. 9 స్థానాలను గులాబీ దళం కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అన్ని స్థానాలు గెలుపొందేందుకు ప్రణాళిక వేస్తుంది. మాజీ స్పీకర్ సురేష్ పార్టీలోకి రావడం కలిసొచ్చే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 7 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా పార్టీ మారి కారులోకి వచ్చేయడంతో, జిల్లాలో బలం 10కి చేరిపోయింది. వరంగల్ 12 సీట్లలో 8 టీఆర్ఎస్, టీడీపీ 2, కాంగ్రెస్ 1, స్వతంత్ర్య అభ్యర్థి గెలుపొందారు. ఆ తరువాత వీరుకూడా గులాబీ కండువా కప్పుకున్నారు, మెదక్ లో 10 సీట్లు ఉంటే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 8 సీట్లు గెలుపొందింది. ఆ తరువాత ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు వంటి కీలక నేతలు కూడా ఉన్న ఉత్తర తెలంగాణాలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, జిల్లా అభివృద్ధే మంత్రంగా ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణాకే ఎక్కువ ప్రయోజనం. ఈ అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ ఐదు జిల్లాలో సీట్లు మొత్తం గెలుపొంది అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

First Published:  24 Oct 2018 3:06 AM GMT
Next Story