Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీస్ ఎన్టీఆర్ గా శ్రీరెడ్డి

శ్రీశక్తిగా పేరుమార్చుకొని కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం చేస్తున్నానని తనకుతానుగా ప్రచారం చేసుకుంది శ్రీరెడ్డి. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖలను కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి లాగింది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించనప్పటికీ, శ్రీరెడ్డికి ఆమె కోరుకున్న ప్రచారమైతే బాగానే వచ్చింది. ఆ ప్రచారంతో పాటు ఆమెకు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ప్రచారం తెచ్చుకున్న శ్రీరెడ్డి.. తమిళనాట ఓ సినిమా ఆఫర్ సంపాదించింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ నడుస్తోంది. […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ గా శ్రీరెడ్డి
X

శ్రీశక్తిగా పేరుమార్చుకొని కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం చేస్తున్నానని తనకుతానుగా ప్రచారం చేసుకుంది శ్రీరెడ్డి. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖలను కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి లాగింది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించనప్పటికీ, శ్రీరెడ్డికి ఆమె కోరుకున్న ప్రచారమైతే బాగానే వచ్చింది. ఆ ప్రచారంతో పాటు ఆమెకు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి.

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ప్రచారం తెచ్చుకున్న శ్రీరెడ్డి.. తమిళనాట ఓ సినిమా ఆఫర్ సంపాదించింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ నడుస్తోంది. త్వరలోనే లారెన్స్ కూడా తనకు ఓ ఆఫర్ ఇవ్వబోతున్నాడంటూ స్వయంగా శ్రీరెడ్డి ప్రకటించింది. ఇప్పుడీ నటి చెంతకు మరో క్రేజీ ఆఫర్ వచ్చిచేరింది. అదే ఎన్టీఆర్ బయోపిక్.

ఇది బాలయ్య నటిస్తున్న బయోపిక్ కాదు. రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న బయోపిక్ అంతకంటే కాదు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నిర్మించబోతున్న లక్ష్మీస్ వీరగ్రంధం అనే బయోపిక్. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం శ్రీరెడ్డిని సంప్రదించాడట నిర్మాత. ప్రస్తుతానికైతే చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ మేటర్ పై ఓ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  24 Oct 2018 10:43 AM GMT
Next Story