Telugu Global
Cinema & Entertainment

దసరాతో ముగిసిన దేవదాస్ కథ

దసరాకు ఒక రోజు అటు ఇటుగా మరోసారి సక్సెస్ మీట్ పెట్టింది దేవదాస్ యూనిట్. ఈ దసరాకు మా సినిమా తప్పకుండా చూడండంటూ నాని, నాగ్ కలిసి మరోసారి ఊదరగొట్టారు. కానీ అప్పటికే దేవదాస్ కథ ముగిసింది. థియేట్రికల్ రన్ పూర్తయింది. పేరుకు ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ నాని సోలోగా నటించిన సినిమా కంటే తక్కువగా వసూళ్లు రావడం విశేషం. దీంతో కాంబినేషన్ కంటే కథ ముఖ్యం అనే విషయం ఇండస్ట్రీకి మరోసారి తెలిసొచ్చింది. అటు ఓవర్సీస్ […]

దసరాతో ముగిసిన దేవదాస్ కథ
X

దసరాకు ఒక రోజు అటు ఇటుగా మరోసారి సక్సెస్ మీట్ పెట్టింది దేవదాస్ యూనిట్. ఈ దసరాకు మా సినిమా తప్పకుండా చూడండంటూ నాని, నాగ్ కలిసి మరోసారి ఊదరగొట్టారు. కానీ అప్పటికే దేవదాస్ కథ ముగిసింది. థియేట్రికల్ రన్ పూర్తయింది. పేరుకు ఇది మల్టీస్టారర్ అయినప్పటికీ నాని సోలోగా నటించిన సినిమా కంటే తక్కువగా వసూళ్లు రావడం విశేషం. దీంతో కాంబినేషన్ కంటే కథ ముఖ్యం అనే విషయం ఇండస్ట్రీకి మరోసారి తెలిసొచ్చింది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయింది. కేవలం వినాయక చవితికి వీకెండ్ కలిసి రావడమే ఈ సినిమాకు ప్లస్ అయింది. అంతకుమించి మేజిక్ క్రియేట్ చేయలేకపోయారు దేవ, దాస్. ఏపీ, నైజాంలో దేవదాస్ క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 5.90 కోట్లు
సీడెడ్ – రూ. 2.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.40 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.90 కోట్లు
గుంటూరు – రూ. 1.50 కోట్లు
కృష్ణా – రూ. 1.20 కోట్లు
నెల్లూరు – రూ. 0.70 కోట్లు

First Published:  25 Oct 2018 10:23 AM GMT
Next Story