Telugu Global
NEWS

విశాఖ వన్డేలో విరాట్ కొహ్లీ విశ్వరూపం

205 ఇన్నింగ్స్ లోనే కొహ్లీ 10 వేలపరుగులు విరాట్ 37వ సెంచరీతో మాస్టర్ రికార్డు తెరమరుగు విండీస్ పై 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీల కొహ్లీ వెస్టిండీస్ తో విశాఖ వేదికగా ముగిసిన రెండో వన్డే ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ …సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా  మాత్రమే కాదు…అత్యంత వేగంగా 10వేల పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు. విరాట్ పరుగుల […]

విశాఖ వన్డేలో విరాట్ కొహ్లీ విశ్వరూపం
X
  • 205 ఇన్నింగ్స్ లోనే కొహ్లీ 10 వేలపరుగులు
  • విరాట్ 37వ సెంచరీతో మాస్టర్ రికార్డు తెరమరుగు
  • విండీస్ పై 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీల కొహ్లీ

వెస్టిండీస్ తో విశాఖ వేదికగా ముగిసిన రెండో వన్డే ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ …సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా మాత్రమే కాదు…అత్యంత వేగంగా 10వేల పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు.

విరాట్ పరుగుల సునామీ….

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ….విండీస్ తో వన్డే సిరీస్ లో సైతం రికార్డుల మోత మోగిస్తున్నాడు. దుబాయ్ వేదికగా ముగిసిన 2018 ఆసియాకప్ టోర్నీకి….దూరంగా ఉన్న విరాట్ కొహ్లీ…విండీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ ద్వారా…రీఎంట్రీ మొదటి రెండువన్డేల్లో శతకాలతో చెలరేగిపోయాడు.

విండీస్ ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డును విరాట్ కొహ్లీ.. విశాఖ వన్డేలో సాధించిన సెంచరీతో అధిగమించాడు.

సచిన్ 1573 పరుగులు….

విండీస్ ప్రత్యర్థిగా తన కెరియర్ లో 39 వన్డేలు ఆడిన సచిన్ 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో మొత్తం 1573 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానాలలో విరాట్ కొహ్లీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ మాత్రమే ఉన్నారు.

కొహ్లీ ధనాధన్….

విరాట్ కొహ్లీ…కరీబియన్ టీమ్ తో ప్రస్తుత సిరీస్ లోని విశాఖ వన్డే వరకూ ఆడిన 29 వన్డేల్లో మొత్తం 1500 పరుగులకు పైగా నమోదు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గౌహతీ, విశాఖ వేదికలుగా ముగిసిన మొదటి రెండువన్డేల్లో ధూమ్ ధామ్ శతకాలు బాదిన కొహ్లీ…. రానున్న మూడువన్డేల్లో సైతం సెంచరీలు బాదితే అది సరికొత్త ప్రపంచ రికార్డే అవుతుంది.

ఇప్పటికే అత్యంత వేగంగా 4 వేలు, 7వేలు పరుగుల ప్రపంచ రికార్డులు సాథించిన కొహ్లీ… 10వేల పరుగుల ప్రపంచ రికార్డును సైతం పూర్తి చేయటం విశేషం.

29 ఏళ్ల వయసులోనే 37 వన్డే సెంచరీలు బాదిన విరాట్ కొహ్లీ… నిలకడగా రాణించడంలో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

టెస్ట్ సిరీస్ లో కొహ్లీని కొంతవరకు నిరోధించిన కరీబియన్ టీమ్… వన్డే సిరీస్ లో ఎంత వరకు అదుపు చేయగలదన్నది అనుమానమే.

First Published:  25 Oct 2018 9:00 AM GMT
Next Story