Telugu Global
National

విజిలెన్స్ చౌద‌రిపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆరోప‌ణ‌లు

సీబీఐ ఇంచార్జ్ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రావుపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌పై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని వెబ్ మీడియా కోడై కూస్తోంది. త‌మిళ‌నాడు వెబ్‌సైట్ క‌థ‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇప్పుడు కేంద్ర విజిలెన్స్ క‌మిష‌నర్ కేవీ చౌద‌రిపై ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేంద్ర ఆర్థిక‌శాఖలో అధికారిగా ఉన్న‌ప్పుడు కేవీ చౌద‌రి అవినీతికి పాల్ప‌డ్డార‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆరోప‌ణ‌. రెవెన్యూ ఇంటెలిజిన్స్ పేరుతో ప‌లుమార్లు దాడులు చేసి…. లంచాలు తీసుకుని ఆకేసులు మాఫీ చేశార‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి […]

విజిలెన్స్ చౌద‌రిపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆరోప‌ణ‌లు
X

సీబీఐ ఇంచార్జ్ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రావుపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌పై ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని వెబ్ మీడియా కోడై కూస్తోంది. త‌మిళ‌నాడు వెబ్‌సైట్ క‌థ‌నం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇప్పుడు కేంద్ర విజిలెన్స్ క‌మిష‌నర్ కేవీ చౌద‌రిపై ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

కేంద్ర ఆర్థిక‌శాఖలో అధికారిగా ఉన్న‌ప్పుడు కేవీ చౌద‌రి అవినీతికి పాల్ప‌డ్డార‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఆరోప‌ణ‌. రెవెన్యూ ఇంటెలిజిన్స్ పేరుతో ప‌లుమార్లు దాడులు చేసి…. లంచాలు తీసుకుని ఆకేసులు మాఫీ చేశార‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ట్వీట్ చేశారు.

పంజాబ్‌కు చెందిన ఓ లేడీ ఆఫీస‌ర్‌తో క‌లిసి ఈ లంచాలు పంచుకున్నార‌ని అన్నారాయ‌న‌. అంతేకాదు వీటికి సంబంధించిన ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని… ఆ పేప‌ర్లు హైద‌రాబాద్‌లో దొరికాయ‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు చిదంబ‌రం కేసు విచార‌ణ‌ ముందుకు పోకపోవ‌డానికి చౌద‌రియే కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

First Published:  24 Oct 2018 8:10 PM GMT
Next Story