ఔషధ విలువలున్న పుచ్చకాయ!

Water Melon Uses
Water Melon Uses
పుచ్చకాయలంటే వేసవిలో దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడతాయని మాత్రమే మనకు తెలుసు. కానీ పుచ్చకాయలు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి. 
 – పుచ్చకాయలలోని వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి. 
 – పుచ్చకాయల నుంచి మన శరీరానికి అందే కెలోరీలు తక్కువే. వంద గ్రాముల పుచ్చకాయల ముక్కల నుంచి 30 కెలోరీలు మాత్రమే అందుతాయి. 
 – వేసవిలో ఎక్కువమంది మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుంటారు. పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
 – రోజులో మూడు కప్పుల పుచక్చకాయ రసాన్ని తాగితే మాంసాహారం తినడం వల్ల ఏర్పడిన కొన్ని వ్యర్థాలు సులువుగా బయటకు పోతాయి.
 – పుచ్చకాయ గింజలను పారేయాల్సిన అవసరం లేదు. చెంచా గింజల్ని పొడి కొట్టి ఆ పొడిని నీటిలో మరిగించి చల్లారాక తాగితే కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజులో కనీసం మూడు కప్పుల నీళ్లు తాగితే మంచిది.
 – పుచ్చకాయ అడుగున తెల్లగా ఉండే పదార్ధం చర్మానికి చాలా మేలు చేస్తుంది. దాంతో చర్మాన్ని రుద్దితే చెమట వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
 – పుచ్చకాయలో ఎర్రని గుజ్జుతో కాసేపు రుద్ది దాన్ని పావుగంట పాటు చర్మంపై ఆరనిస్తే మృతకణాలు తొలగిపోతాయి.
 – అధిక రక్తపోటుతో బాధపడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులోని అమినో ఆమ్లాలు గుండెకు సంబంధించిన కండరాలని సడలించి రక్త సరఫరా సక్రమంగా అయ్యేట్లు చేస్తాయి.