Telugu Global
International

ఆండ్రాయిడ్‌ క్రియేటర్‌ కు కూడా "మీటూ"తో ఉద్వాసన....

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజానికి కూడా ఆ మకిలి అంటుకుంది. మీటూ మంటలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ కంపెనీలను షేక్ చేస్తున్నాయనడానికి తాజా ఘటన గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. గూగుల్ లాంటి ప్రఖ్యాత సంస్థలో కూడా అలాంటి పాడుపనులు బయటకు రావడం.. సంస్థ పెద్ద తలకాయలను కోట్లు కుమ్మరించి బయటకు పంపడం తాజాగా సంచలనంగా మారింది. గూగుల్ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో 48మంది సీనియర్ పురుష ఉద్యోగులను […]

ఆండ్రాయిడ్‌ క్రియేటర్‌ కు కూడా మీటూతో ఉద్వాసన....
X

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజానికి కూడా ఆ మకిలి అంటుకుంది. మీటూ మంటలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ కంపెనీలను షేక్ చేస్తున్నాయనడానికి తాజా ఘటన గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. గూగుల్ లాంటి ప్రఖ్యాత సంస్థలో కూడా అలాంటి పాడుపనులు బయటకు రావడం.. సంస్థ పెద్ద తలకాయలను కోట్లు కుమ్మరించి బయటకు పంపడం తాజాగా సంచలనంగా మారింది.

గూగుల్ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో 48మంది సీనియర్ పురుష ఉద్యోగులను గూగుల్ ఉద్యోగాల్లోంచి నిర్ధాక్షిణ్యంగా తీసేసింది. ఇందులో 13మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఉండడం విశేషం.

వీరేకాక గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఆండ్రాయిడ్ క్రియేటర్ ఆండీ రూబిన్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడట్టు నిరూపితం కావడం గూగుల్ లో కలకలం రేపింది. ఆయనకు 90 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించి మరీ తొలగిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా లేఖ విడుదల చేశారు.

గడిచిన రెండేళ్లుగా గూగుల్ సంస్థలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48మంది ఉద్యోగులను గుర్తించి తొలగించామని గూగుల్ సంస్థ తమ ఉద్యోగులందరికీ మెయిల్ పంపింది. ఎగ్జిట్ ప్యాకేజీ ఉన్న 13మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు 90మిలియన్ల చొప్పున చెల్లించి పంపించామని అందులో పేర్కొంది. అధికార దుర్వినియోగానికి పాల్పడే ఎవ్వరిపైనైనా చర్యలు తీసుకుంటామని సుందర్ పిచాయ్ ఆ లేఖలో స్పష్టం చేశారట. గూగుల్ లో పనిచేసే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని గూగుల్ సీఈవో లేఖలో తెలిపారు.

గూగుల్ వ్యవహారంపై తాజాగా న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. ఆండ్రాయిడ్ క్రియేటర్ అయిన గూగుల్ సీనియర్ ఉద్యోగి రూబిన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు పదేళ్లుగా ఉన్నాయని…. కానీ ఆయన తెలివితేటలకు గూగుల్ సంస్థ ఆయన్ను కాపాడుకుంటూ వచ్చిందని కొన్ని డాక్యుమెంట్లను, ఇంటర్వ్యూలను బహిర్గతం చేసి సంచలనం సృష్టించింది. పత్రిక కథనంతో…. ఇంటా బయటా ఆరోపణలు నిజమేనని తేలడంతో ఎట్టకేలకు గూగుల్ రూబిన్ పై చర్యలు తీసుకుందని పత్రిక వెల్లడించింది.

First Published:  26 Oct 2018 1:26 AM GMT
Next Story