Telugu Global
NEWS

కమెడియన్‌ శివాజీ అరెస్ట్‌కు ఊపందుకుంటున్న డిమాండ్

చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. దాని వల్లే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. జగన్‌పై దాడిని వివిధ పార్టీల నేతలు ఖండించినా తప్పుపట్టడం బట్టే చంద్రబాబు మానసిక స్థితి అర్థమవుతోందన్నారు. ఎప్పుడు ఎవరితో అవసరం అవుతుందో వారిని ఎన్నుకుని పథక రచన చేయడం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటేనన్నారు. అందులో భాగమే ఆపరేషన్ గరుడ అని మండిపడ్డారు. శివాజీ అనే ఫిల్మ్ యాక్టర్ చెప్పే మాటలను ముఖ్యమంత్రి […]

కమెడియన్‌ శివాజీ అరెస్ట్‌కు ఊపందుకుంటున్న డిమాండ్
X

చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. దాని వల్లే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. జగన్‌పై దాడిని వివిధ పార్టీల నేతలు ఖండించినా తప్పుపట్టడం బట్టే చంద్రబాబు మానసిక స్థితి అర్థమవుతోందన్నారు.

ఎప్పుడు ఎవరితో అవసరం అవుతుందో వారిని ఎన్నుకుని పథక రచన చేయడం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటేనన్నారు. అందులో భాగమే ఆపరేషన్ గరుడ అని మండిపడ్డారు. శివాజీ అనే ఫిల్మ్ యాక్టర్ చెప్పే మాటలను ముఖ్యమంత్రి చదివి వినిపిస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉందా అని ప్రశ్నించారు.

సినీ యాక్టర్‌కు తెలిసే అన్ని జరుగుతున్నాయన్నది తెలిసినప్పుడు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరిపై దాడి జరుగుతుందో చెబుతున్న శివాజీని ఎందుకు అదుపులోకి తీసుకుని విచారించడం లేదని ప్రశ్నించారు. అతడికి ఇవన్నీ ఎలా తెలిశాయో విచారించి తెలుసుకుని జరగబోయే దాడులను అడ్డుకోవాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.

శివాజీ ఏమైనా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామా అని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయో చెబుతున్న శివాజీని అరెస్ట్ చేసి విచారించి అతడి వద్ద సమాచారాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.

తమకు తెలిసి ఈ ఆపరేషన్ గరుడ మొత్తం చంద్రబాబు నడుపుతున్నదే అని కన్నా చెప్పారు. ఒక యాక్టర్ చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి చదివి వినిపిస్తున్నారంటే ఇంతకంటే చేతగాని వ్యక్తి ఎక్కడైనా ఉంటారా అని కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు.

First Published:  26 Oct 2018 8:19 AM GMT
Next Story