Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ కోసం శ్రద్ధ కపూర్ ఐటెం గర్ల్ గా మారుతోందా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. “వినయ విధేయ రామ” అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రావాల్సింది ఉంది. పవర్ ఫుల్ కథతో మంచి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక భారీ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాడట. అందుకోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా సంప్రదించాడు, కానీ రకుల్ కి ఐటెం సాంగ్ […]

రామ్ చరణ్ కోసం శ్రద్ధ కపూర్ ఐటెం గర్ల్ గా మారుతోందా ?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. “వినయ విధేయ రామ” అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రావాల్సింది ఉంది. పవర్ ఫుల్ కథతో మంచి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక భారీ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాడట. అందుకోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా సంప్రదించాడు, కానీ రకుల్ కి ఐటెం సాంగ్ చెయ్యడం ఇష్టం లేకపోవడంతో ఈ ఆఫర్ కి రిజెక్ట్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ ఆఫర్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రద్ధ కపూర్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన “సాహో” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ సినిమా నుంచి ఐటెం సాంగ్ ఆఫర్ ని అందుకుంది శ్రద్ధ కపూర్. కానీ శ్రద్ధ కపూర్ కూడా ఐటెం సాంగ్ అంటే ఎలాగైనా నో అంటుంది అనే అంచనాతో ఉన్నారు మూవీ యూనిట్. కానీ వేరే ఇతర కాంటాక్ట్స్ ద్వారా బోయపాటి శ్రద్ధ కపూర్ నే ఐటెం గర్ల్ గా పెట్టాలి అని భావిస్తున్నాడు. మరి శ్రద్ధ ఈ ఆఫర్ ని ఎంత వరకు ఒప్పుకుంటుందో చూడాలి.

First Published:  26 Oct 2018 3:59 AM GMT
Next Story