Telugu Global
NEWS

గాయంలో అల్యూమినియం ఉంది, పరామర్శలకు రావొద్దు " ధర్మాన

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు…. దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాలన్నారు. తొలి రోజు దాడిని ఖండించిన లోకేష్ ఆ వెంటనే కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారని మేకపాటి నిలదీశారు. కత్తి తగలరాని చోట తగిలి ఉంటే ప్రాణాలు పోయేవన్నారు. సోమిరెడ్డి భారీ ప్లాన్‌ చేస్తామంటుంటే… కేశినేని నాని జగన్‌ను కైమా కొట్టేవారిమంటున్నారని… ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు […]

గాయంలో అల్యూమినియం ఉంది, పరామర్శలకు రావొద్దు  ధర్మాన
X

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు…. దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియాలన్నారు. తొలి రోజు దాడిని ఖండించిన లోకేష్ ఆ వెంటనే కొత్త పల్లవి ఎందుకు అందుకున్నారని మేకపాటి నిలదీశారు.

కత్తి తగలరాని చోట తగిలి ఉంటే ప్రాణాలు పోయేవన్నారు. సోమిరెడ్డి భారీ ప్లాన్‌ చేస్తామంటుంటే… కేశినేని నాని జగన్‌ను కైమా కొట్టేవారిమంటున్నారని… ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని మేకపాటి నిలదీశారు.

ఎంపీ కేశినేని నాని మాటలు చంద్రబాబుకు సిగ్గుగా అనిపించలేదా అని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. టీడీపీ నేతల దయాదాక్షిణ్యాల మీద ఏపీలో నేతలు, ప్రజలు బతకాలా అని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు దయదలిచారు కాబట్టి బతుకుతున్నారు…. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే జగన్ కైమా కైమా అయ్యేవాడని వ్యాఖ్యానించడానికి సిగ్గుగా లేదా అని మండిపడ్డారు.

జగన్‌పై దాడి జరిగిన వెంటనే…. విచారణ చేయకముందే…. డీజీపీ తన అభిప్రాయాన్ని ఎలా చెబుతున్నారని విమర్శించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వ్యవస్థలు నాశనం అవుతున్నాయని మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతి కేసుల మీద విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రే ఢిల్లీకి వెళ్లి తనకు ఆందోళనగా ఉందని చెప్పడం ద్వారా పరువు తీస్తున్నారని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి ఘటనపై థర్డ్‌ పార్టీ ఏజెన్సీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ పాత్ర కాకుండా విలన్‌ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌కు అయిన గాయంలో అల్యూమినియం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని ధర్మాన చెప్పారు. కాబట్టి వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారన్నారు. జగన్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నందున ఆయన్ను కలిసేందుకు వస్తున్న వారు కొద్ది రోజలు ఆగాల్సిందిగా ధర్మాన ప్రసాదరావు సూచించారు.

First Published:  27 Oct 2018 6:55 AM GMT
Next Story