Telugu Global
NEWS

మరి లోకేష్‌ కూడా మోడీ కుట్రలో భాగమేనా " కేటీఆర్‌

జగన్‌పై జరిగిన దాడిని కేసీఆర్‌, కేటీఆర్‌, పవన్‌ కల్యాణ్ ఖండించడాన్ని చంద్రబాబు తప్పుపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఎందుకు ఇంత అమానవీయంగా తయారయ్యాడో అర్థం కావడం లేదన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు దేన్ని చూసినా ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై దాడి జరగగానే లోకేష్‌ కూడా ఖండిస్తూ ట్వీట్ చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. మరి లోకేష్‌ కూడా మోడీ కుట్రలో […]

మరి లోకేష్‌ కూడా మోడీ కుట్రలో భాగమేనా  కేటీఆర్‌
X

జగన్‌పై జరిగిన దాడిని కేసీఆర్‌, కేటీఆర్‌, పవన్‌ కల్యాణ్ ఖండించడాన్ని చంద్రబాబు తప్పుపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఎందుకు ఇంత అమానవీయంగా తయారయ్యాడో అర్థం కావడం లేదన్నారు.

పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు దేన్ని చూసినా ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌పై దాడి జరగగానే లోకేష్‌ కూడా ఖండిస్తూ ట్వీట్ చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు.

మరి లోకేష్‌ కూడా మోడీ కుట్రలో భాగంగానే పని చేశారా? అని ప్రశ్నించారు. మనందరికీ తెలిసిన వ్యక్తి అయిన జగన్‌పై దాడి జరిగితే దాన్ని ఖండించడం కూడా తప్పనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ఘటన జరిగిన వెంటనే విచారం వ్యక్తం చేసి…. దర్యాప్తు చేయిస్తాం అని ఉంటే సరిపోయేదన్నారు కేటీఆర్. అలా చేయకుండా ఆపరేషన్ గరుడ అంటున్నారంటే చంద్రబాబు ఏదో భీతావహ స్థితిలో ఉన్నట్టుగా అర్థమవుతోందన్నారు.

జగన్‌పై దాడిని ఖండించిన వారంతా మోడీ కుట్రలో భాగస్తులైతే మరి లోకేష్‌ కూడా మోడీ కుట్రలో పనిచేస్తున్నారా? అని కేటీఆర్ నిలదీశారు. మెడపై పొడవబోతే అదృష్టవశాత్తు అది భుజానికి తగిలిందని పత్రికల్లోనే వచ్చిందని… ఒకవేళ నిజంగానే జగన్‌కు ఏమైనా అయి ఉంటే ప్రతిపక్షనేతను కూడా కాపాడలేని అసమర్థ ప్రభుత్వం అన్న అపఖ్యాతి చంద్రబాబుకు వచ్చి ఉండేది కదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు చేస్తున్న చర్యలు తనకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయన్నారు. తిత్లీ తుపాను వస్తే అక్కడ పర్యటించిన ముఖ్యమంత్రి దాన్ని కూడా ప్రచారానికి వాడుకుని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బస్సులపై పోస్టర్లు వేయించుకోవడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించడం ఒక బాధ్యత అని…. దాన్ని కూడా ప్రచారం చేసుకోవడం వింతగా ఉందన్నారు.

ప్రైవేట్ సంస్థలపై ఐటీ దాడులు సాధారణంగానే జరుగుతుంటాయని… కానీ చంద్రబాబు మాత్రం ఆ అంశాన్ని కేబినెట్‌లో చర్చకు పెట్టి ఆంధ్రాపై దాడి అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రమేష్ కంపెనీపై దాడులు జరిగాయే గానీ… సీఎంపై జరగలేదు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. జగన్‌పై దాడిని ఖండించిన వారిపై చంద్రబాబు వ్యాఖ్యలు చాలా అమానవీయంగా ఉన్నాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

First Published:  26 Oct 2018 10:46 PM GMT
Next Story