Telugu Global
NEWS

ముమ్మాటికీ మర్డర్‌ ప్లానే... ఫ్లెక్సీని మార్చబోయి దొరికిన ఎల్లో గ్యాంగ్‌

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్దలున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న చర్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి. ఘటన జరిగిన అర గంటకే సాక్ష్యాత్తు ఏపీ డీజీపీ ఠాకూర్ మీడియా ముందుకు వచ్చి దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని సెలవిచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. దాన్ని నమ్మించేందుకు ఒక ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోను విడుదల చేసి హడావుడి చేశారు. కానీ ఆ ఫొటో ఎక్కడ తీశారు… ఆ ఫ్లెక్సీ ఎక్కడ ఉంది […]

ముమ్మాటికీ మర్డర్‌ ప్లానే... ఫ్లెక్సీని మార్చబోయి దొరికిన ఎల్లో గ్యాంగ్‌
X

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక పెద్దలున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న చర్యలే ఇందుకు ఊతమిస్తున్నాయి.

ఘటన జరిగిన అర గంటకే సాక్ష్యాత్తు ఏపీ డీజీపీ ఠాకూర్ మీడియా ముందుకు వచ్చి దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని సెలవిచ్చి అందరినీ షాక్‌కు గురి చేశారు. దాన్ని నమ్మించేందుకు ఒక ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోను విడుదల చేసి హడావుడి చేశారు. కానీ ఆ ఫొటో ఎక్కడ తీశారు… ఆ ఫ్లెక్సీ ఎక్కడ ఉంది అన్న ప్రశ్న రావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. వెంటనే ఒక ఫ్లెక్సీని సృష్టించేశారు.

జనవరిలో ఫ్లెక్సీని ఇప్పుడు గుర్తించేశారట. అనుమానం రాకుండా ఫ్లెక్సీని కొంచెం చించేసి పొలాల్లో పడి ఉందంటూ మీడియాను తీసుకెళ్లి పోలీసులు చూపించారు. అయితే మరోసారి ఇదంతా ఫేక్‌ అని తేలిపోయింది. తొలుత విడుదల చేసిన ఫ్లెక్సీ ఫొటోకు, నిన్న దొరికిందని చూపించిన ఫ్లెక్సీకి మధ్య చాలా తేడాలు బయటపడ్డాయి. దీంతో మరోసారి ఎల్లో గ్యాంగ్‌ దొరికిపోయింది.

ఫ్లెక్సీ ఫొటోలో హ్యాపీ న్యూ ఇయర్‌ తరువాత రోమన్‌ ‘అండ్‌’ గుర్తు ఒక్కటే ఉండి అనంతరం పొంగల్‌ అని రాసి ఉంది. కానీ శుక్రవారం నాడు పోలీసులు చూపిస్తున్న ఫ్లెక్సీలో రోమన్‌ ‘అండ్‌’తో పాటు కొన్ని పువ్వుల బొమ్మలు కూడా ముద్రించి ఉన్నాయి.

పైగా ఫొటోలో గద్ద బొమ్మ కూడా తేడాగా ఉంది. దీంతో వాటిని పోల్చి చూసిన వారు … లేనిది ఉన్నట్టు ప్రజలను నమ్మించేందుకు టీడీపీ నేతలు, పోలీసులు కలిసి నాటకాలాడుతున్నారని మండిపడుతున్నారు. నిందితుడి వద్ద 11 పేజీల లేఖ ఉందని డీజీపీ చెప్పగానే దాన్ని ఉన్నట్టు చూపించేందుకు ఏకంగా ముగ్గురి చేతిరాతలతో ఉన్న లేఖను మీడియాకు విడుదల చేశారు.

తీరా చూస్తే… నిందితుడి జేబులో దొరికిందని చెబుతున్న 11 పేజీల లేఖ మడతలు లేకుండా ఉండడం చూసి అందరూ కంగుతిన్నారు. 11 పేజీల లేఖ నిందితుడు జేబులో పెట్టుకుంటే కనీసం మడతలు ఎందుకు లేవని, కనీసం నలగను కూడా లేదని ప్రశ్నించగానే ఇక అటువైపు నుంచి సమాధానం లేదు.

ఇలా జగన్‌పై హత్యాయత్నంలో అసలు విషయాన్ని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నా చిన్నచిన్న పొరపాట్లతో దొరికిపోతున్నారు.

First Published:  26 Oct 2018 8:49 PM GMT
Next Story