Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాకు 35 ఏళ్లు

ప్రతి హీరోకు తమ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాలు కొన్ని ఉంటాయి. అప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఆ ఒక్క సినిమా మరో ఎత్తు. వాళ్ల జీవితాల్ని పూర్తిగా మార్చేసే సినిమాలవి. ఓవర్ నైట్ వాళ్లను స్టార్స్ ను చేసే సినిమాలవి. ప్రతి హీరోకు అలాంటి మూవీస్ ఉంటాయి. చిరంజీవికి కూడా ఉంది. అదే ఖైదీ 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ ను సమూలంగా మార్చేసింది. హాలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ బ్లడ్ అనే […]

చిరంజీవి సినిమాకు 35 ఏళ్లు
X

ప్రతి హీరోకు తమ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాలు కొన్ని ఉంటాయి. అప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఆ ఒక్క సినిమా మరో ఎత్తు. వాళ్ల జీవితాల్ని పూర్తిగా మార్చేసే సినిమాలవి. ఓవర్ నైట్ వాళ్లను స్టార్స్ ను చేసే సినిమాలవి. ప్రతి హీరోకు అలాంటి మూవీస్ ఉంటాయి. చిరంజీవికి కూడా ఉంది. అదే ఖైదీ

1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ ను సమూలంగా మార్చేసింది. హాలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ బ్లడ్ అనే సినిమాకు ఫ్రీమేక్ గా పరుచూరి బ్రదర్స్ అల్లిన ఈ సినిమా చిరంజీవిని సుప్రీమ్ హీరోగా మార్చింది. కోదండరాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి స్టార్ డమ్ కు పునాదిరాయిగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఈ సినిమాలో చిరంజీవి నటన ఒక ఎత్తయితే, డైలాగ్స్-మ్యూజిక్ మరో ఎత్తు. పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ సినిమా డైలాగ్స్ అప్పట్లో మార్మోగిపోయాయి. ఇక చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రతి పాట హిట్ అయింది. ఈ సినిమా ఈరోజంతా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి కారణం, 35 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు (అక్టోబర్ 28) ఈ సినిమా విడుదలైంది.

First Published:  28 Oct 2018 11:32 AM GMT
Next Story