Telugu Global
International

భారత్ ఆహ్వానం.... నో అన్న ట్రంప్.... కారణం అదేనా?

భారత్ పై అమెరికా అసంతృప్తి మరోసారి బయటపడింది. వీసాల విషయంలో కఠినంగా ఉన్న ఆ దేశం, భారత రాయబారాన్ని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే వేడుకులకు ట్రంప్ ను భారత ప్రభుత్వం ఆహ్వానించగా, రానని తిరిగి లేఖ రాశారు. ఇది భారత్-అమెరికా సంబంధాలకు ఇబ్బంది అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. రిపబ్లిక్ వేడుకలకు ప్రతీ ఏడాది ఎవరో ఒక దేశాధ్యక్షుడుని ఆహ్వానించడం ఆనవాయితీ. అదే క్రమంలో ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆహ్వానం […]

భారత్ పై అమెరికా అసంతృప్తి మరోసారి బయటపడింది. వీసాల విషయంలో కఠినంగా ఉన్న ఆ దేశం, భారత రాయబారాన్ని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లిక్ డే వేడుకులకు ట్రంప్ ను భారత ప్రభుత్వం ఆహ్వానించగా, రానని తిరిగి లేఖ రాశారు. ఇది భారత్-అమెరికా సంబంధాలకు ఇబ్బంది అని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

రిపబ్లిక్ వేడుకలకు ప్రతీ ఏడాది ఎవరో ఒక దేశాధ్యక్షుడుని ఆహ్వానించడం ఆనవాయితీ. అదే క్రమంలో ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆహ్వానం పలికారు. అయితే, కొత్త ఏడాది ప్రారంభంలో స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంతో పాటు, వేరే పనులు ఉండటం వల్ల రావడం కుదరదని ట్రంప్ ఖరాఖండిగా చెబుతూ జాతీయ భధ్రతా సలహాదారు అజిత్ దోవల్ కు లేఖ రాసింది.

అయితే రష్యాతో సాన్నిహిత్యాన్ని మనసులో ఉంచుకునే భారత్ ను ట్రంప్ దూరం పెట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యాతో యుద్ధ నౌకల కొనుగోలు ఒప్పందం, ఇరాన్ నుంచి చమురు కొనరాదన్న ఆంక్షను బేఖాతరు చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించాయని భావిస్తున్నారు. ఇదే ట్రంప్ అంసతృప్తికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు.

కాగా, గత 2015 గణతంత్ర వేడుకల్లో బరాక్ ఒబామాను ఆహ్వానించినప్పుడు, స్టేట్ ఆఫ్ ది ఇయర్ ప్రసంగం ఉన్నా వాయిదా వేసుకొని ఆయన హాజరయ్యారు. కానీ ఈ సారి ట్రంప్ వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆది నుంచి భారత్ ను.. భారత పెట్టుబడులు, గ్రీన్ కార్డ్ తదితర వ్యవహారాలపై సీరియస్ గా ఉన్నారు. అమెరికన్ల ఉద్యోగాలను ఎక్కువగా కొల్లగొడుతున్నది ఇండియన్సే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ చేసిన ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇందుకు ఇటీవల రష్యాతో చెలిమిని సాకుగా చూపించారని అంటున్నారు.

First Published:  28 Oct 2018 6:00 AM GMT
Next Story