Telugu Global
National

డబ్బులిస్తాం... వారెంట్ వెనక్కు తీసుకోండి " జడ్జికి కమ్మసంఘం పేరుతో లేఖ

మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు నిందితుడిగా ఉన్న బాబ్లీ కేసును విచారిస్తున్న న్యాయమూర్తికి ఈ బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని కమ్మ సంఘం పేరుతో ఈనెల 25న మూడు పేజీల బెదిరింపు లేఖ స్పీడ్‌ పోస్టులో వెళ్లింది. చంద్రబాబు అరెస్ట్ వారెంట్ విషయంలోనే ఈ బెదిరింపు లేఖ వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. డబ్బులు కావాలంటే  ఇస్తాం… చంద్రబాబుపై అరెస్ట్ వారెంట్‌ను వెనక్కు తీసుకోండి అని లేఖలో ఆఫర్ […]

డబ్బులిస్తాం... వారెంట్ వెనక్కు తీసుకోండి  జడ్జికి కమ్మసంఘం పేరుతో లేఖ
X
మహారాష్ట్ర ధర్మాబాద్‌ కోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు నిందితుడిగా ఉన్న బాబ్లీ కేసును విచారిస్తున్న న్యాయమూర్తికి ఈ బెదిరింపులు వచ్చాయి.
హైదరాబాద్‌లోని కమ్మ సంఘం పేరుతో ఈనెల 25న మూడు పేజీల బెదిరింపు లేఖ స్పీడ్‌ పోస్టులో వెళ్లింది. చంద్రబాబు అరెస్ట్ వారెంట్ విషయంలోనే ఈ బెదిరింపు లేఖ వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.
డబ్బులు కావాలంటే ఇస్తాం… చంద్రబాబుపై అరెస్ట్ వారెంట్‌ను వెనక్కు తీసుకోండి అని లేఖలో ఆఫర్ చేశారు. ఒకవేళ వారెంట్ వెనక్కు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని న్యాయమూర్తిని లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న మహా రాష్ట్ర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. న్యాయమూర్తికి భద్రతను పెంచారు.
First Published:  28 Oct 2018 6:20 AM GMT
Next Story