Telugu Global
Cinema & Entertainment

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి

కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. ఈసారి కూడా ఆమె మరోసారి విరుచుకుపడింది. పేరు చెప్పకుండా ఓ కోలీవుడ్ ప్రముఖుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. “కోలీవుడ్ కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ అతడు.  నడిగర్ సంఘంలో కూడా అతడు చాలా కీలకంగా ఉంటాడు. హీరోయిన్లను లైంగికంగా వేధించడంలో దిట్ట అతడు. కొంతమంది హీరోయిన్లను అతడు బలత్కారం చేశాడు. వాళ్లకు డబ్బు ఇచ్చి పంపించాడు.” ఇలా కోలీవుడ్ కు చెందిన […]

మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి
X

కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. ఈసారి కూడా ఆమె మరోసారి విరుచుకుపడింది. పేరు చెప్పకుండా ఓ కోలీవుడ్ ప్రముఖుడిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.

“కోలీవుడ్ కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ అతడు. నడిగర్ సంఘంలో కూడా అతడు చాలా కీలకంగా ఉంటాడు. హీరోయిన్లను లైంగికంగా వేధించడంలో దిట్ట అతడు. కొంతమంది హీరోయిన్లను అతడు బలత్కారం చేశాడు. వాళ్లకు డబ్బు ఇచ్చి పంపించాడు.”

ఇలా కోలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోపై శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించింది. తాజా ఆరోపణలకు సంబంధించి తనవద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది శ్రీరెడ్డి. కావాలంటే పోలీసులు, లాయర్లు, మీడియా ముందు వాటిని బయటపెడతానని కూడా సదరు సెలబ్రిటీకి హెచ్చరికలు జారీచేసింది.

ఇకనైనా ఆ వ్యక్తి తన వ్యవహార శైలి మార్చుకోవాలని లేదంటే భవిష్యత్తులో పెళ్లి కూడా అవ్వదని తీవ్ర పదజాలంతో హెచ్చరించింది శ్రీరెడ్డి. తన వద్దకు కొంతమంది వచ్చి, ఆ సెలబ్రిటీ రాసలీలల బాగోతాలు మొత్తం చెప్పారని అంటోంది. అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడంలో ఆరితేరిపోయిన ఆ వ్యక్తి, పైకి మాత్రం పెద్దమనిషిగా చలామణి అవుతున్నాడని విమర్శించింది శ్రీరెడ్డి.

First Published:  28 Oct 2018 3:57 AM GMT
Next Story