Telugu Global
Cinema & Entertainment

నాని లిస్ట్ లో మరో దర్శకుడు

నాని లిస్ట్ లో పెండింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ చిన్నదేం కాదు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోల లిస్ట్ లో కూడా ఇంతమంది దర్శకులు లేవు. ఏ దర్శకుడైనా కొత్తగా ఓ కాన్సెప్ట్ ఫీల్ అయితే నాని దగ్గరకు వెళ్లిపోతున్నాడు. అలా నాని దగ్గర పెండింగ్ లో చాలామంది దర్శకులున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి శ్రీకాంత్ అడ్డాల కూడా చేరిపోయాడు. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత పత్తాలేకుండా పోయిన ఈ దర్శకుడు ఎట్టకేలకు మరో కథ రాసుకున్నాడు. […]

నాని లిస్ట్ లో మరో దర్శకుడు
X
నాని లిస్ట్ లో పెండింగ్ లో ఉన్న దర్శకుల లిస్ట్ చిన్నదేం కాదు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోల లిస్ట్ లో కూడా ఇంతమంది దర్శకులు లేవు. ఏ దర్శకుడైనా కొత్తగా ఓ కాన్సెప్ట్ ఫీల్ అయితే నాని దగ్గరకు వెళ్లిపోతున్నాడు. అలా నాని దగ్గర పెండింగ్ లో చాలామంది దర్శకులున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి శ్రీకాంత్ అడ్డాల కూడా చేరిపోయాడు.
బ్రహ్మోత్సవం సినిమా తర్వాత పత్తాలేకుండా పోయిన ఈ దర్శకుడు ఎట్టకేలకు మరో కథ రాసుకున్నాడు. అది కూడా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు స్టయిల్ లోనే రాసుకున్నాడు. రీసెంట్ గా ఈ కథను నానికి వినిపించాడు. ఈ స్టోరీలైన్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో తెలీదు కానీ, అడ్డాల దర్శకత్వంలో నేచురల్ స్టార్ అంటూ కథనాలు మాత్రం వచ్చేశాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ కు శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా బాకీ ఉన్నాడు. అతడి కోసమే ఈ కథ రాశాడు. అరవింద్ కు స్టోరీలైన్ నచ్చింది. నానికి ఓసారి వినిపించి రమ్మని పురమాయించాడు. అలా అల్లు అరవింద్ రిఫరెన్స్ తో నానికి కథ వినిపించాడు శ్రీకాంత్ అడ్డాల.
ఈ కాంబినేషన్ కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇదే. జెర్సీ కంప్లీట్ అయిన తర్వాత ఈ కథపై ఓ నిర్ణయం తీసుకుంటాడు నాని. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు టైపు కథ ఇది. అంటే ఇంకో హీరోకు కూడా చోటుందన్నమాట. మరి ఆ రెండో హీరో ఎవరో..?
First Published:  28 Oct 2018 5:52 AM GMT
Next Story