Telugu Global
Cinema & Entertainment

నాగార్జున పై గుర్రుగా ఉన్న అభిమానులు

అక్కినేని నాగార్జున ఈ ఏడాది నానితో కలిసి “దేవదాస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా అక్కినేని అభిమానులకి అంతగా ఏమి ఎక్కలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా అస్సలు వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున అభిమానులు ఎంజాయ్ చేసే అంశాలు ఏవి లేవు. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం తెలుగు లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయట్లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం “బ్రహ్మాస్త్ర” సినిమాతో బిజీగా ఉన్నాడు. […]

నాగార్జున పై గుర్రుగా ఉన్న అభిమానులు
X

అక్కినేని నాగార్జున ఈ ఏడాది నానితో కలిసి “దేవదాస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా అక్కినేని అభిమానులకి అంతగా ఏమి ఎక్కలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా అస్సలు వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున అభిమానులు ఎంజాయ్ చేసే అంశాలు ఏవి లేవు.

ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం తెలుగు లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి చేయట్లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం “బ్రహ్మాస్త్ర” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా తరువాత ధనుష్ తో తమిళ్ లో ఒక మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు నాగార్జున. ఇది కూడా అయిపోగానే మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. నాగార్జున ఈ సినిమాలు చేస్తున్నాడు అని తెలుసుకున్న అక్కినేని అభిమానులు నాగార్జున పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు అభిమానుల కోసం ఒక్క సినిమా కూడా చెయ్యకుండా వేరే భాషల్లో సినిమా చేసుకోవడం ఏంటి అని సీరియస్ అవుతున్నారు. మరి అభిమానుల కోసం అయిన నాగార్జున తెలుగు లో ఒక సినిమా చేస్తాడేమో చూడాలి .

First Published:  30 Oct 2018 4:47 AM GMT
Next Story