Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ సరసన ఆదా శర్మ

“గరుడ వేగా” సినిమా తరువాత రాజశేఖర్ నటిస్తున్న సినిమా “కల్కి”. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం తన లుక్ పై దృష్టి పెట్టాడు రాజశేఖర్. “కల్కి” టైటిల్ తో వస్తున్న ఈ సినిమా 1983 తెలంగాణ నేపథ్యంలో తెరెకెక్కుతుంది. ప్రత్యేకంగా సినిమాకు సంబందించిన సెట్ కూడా వేయబోతున్నారు టీమ్. దీనికోసం కనీసం 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. “గరుడవేగ” సినిమా బాగున్నా కూడా డబ్బులు ఎందుకు రాలేదంటే భారీ […]

రాజశేఖర్ సరసన ఆదా శర్మ
X

“గరుడ వేగా” సినిమా తరువాత రాజశేఖర్ నటిస్తున్న సినిమా “కల్కి”. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం తన లుక్ పై దృష్టి పెట్టాడు రాజశేఖర్. “కల్కి” టైటిల్ తో వస్తున్న ఈ సినిమా 1983 తెలంగాణ నేపథ్యంలో తెరెకెక్కుతుంది. ప్రత్యేకంగా సినిమాకు సంబందించిన సెట్ కూడా వేయబోతున్నారు టీమ్. దీనికోసం కనీసం 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

“గరుడవేగ” సినిమా బాగున్నా కూడా డబ్బులు ఎందుకు రాలేదంటే భారీ బడ్జెట్ కారణం. మరోసారి ఇదే తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా కనీసం 15 కోట్లతో “కల్కి” సినిమా తెరెక్కనున్నది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రశాంత్ వర్మ ఇటివలే రాజశేఖర్ ఇంకా ఆదా శర్మ పై లుక్ టెస్ట్ కూడా చేసాడట. ఈ సినిమాలో రాహుల్ రామ‌కృష్ణ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రంతో ఖచ్చితంగా త‌ను క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొడ‌తానంటున్నాడు రాజ‌శేఖ‌ర్. మరి రాజశేఖర్ ఎం చేస్తాడో చూడాలి.

First Published:  29 Oct 2018 11:12 PM GMT
Next Story