Telugu Global
Cinema & Entertainment

డిటెక్టివ్.. ఇది 6 భాగాల సినిమా

సాధారణంగా ఓ సినిమా హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ ప్రకటిస్తారు. అది కూడా హిట్ అయితే మరో సీక్వెల్ చేస్తారు. ఎప్పుడైతే ఫ్లాప్ వస్తుందో ఆ వెంటనే సీక్వెల్స్ ఆపేస్తారు. కానీ విశాల్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తను నటించిన ఓ హిట్ సినిమాకు ఏకంగా 6 సీక్వెల్స్ చేస్తానంటున్నాడు. “డిటెక్టివ్‌-2 సినిమా విదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ ఓ కేసును సాల్వ్‌ చేయడానికి హీరో […]

డిటెక్టివ్.. ఇది 6 భాగాల సినిమా
X

సాధారణంగా ఓ సినిమా హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ ప్రకటిస్తారు. అది కూడా హిట్ అయితే మరో సీక్వెల్ చేస్తారు. ఎప్పుడైతే ఫ్లాప్ వస్తుందో ఆ వెంటనే సీక్వెల్స్ ఆపేస్తారు. కానీ విశాల్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తను నటించిన ఓ హిట్ సినిమాకు ఏకంగా 6 సీక్వెల్స్ చేస్తానంటున్నాడు.

“డిటెక్టివ్‌-2 సినిమా విదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ ఓ కేసును సాల్వ్‌ చేయడానికి హీరో వెళతాడు. సాధారణంగా మనం చిన్నప్పటి నుండి హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. ఆ తరహా కథలతో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. డిటెక్టివ్‌ ఆ స్టయిల్‌ ఆఫ్‌ మూవీ. డిటెక్టివ్‌ 6 భాగాలుగా చేయాలని డైరెక్టర్‌ మిస్కిన్‌ అనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను.”

ఇలా డిటెక్టివ్ సినిమాకు సంబంధించిన వివరాల్ని బయటపెట్టాడు విశాల్. అంతేకాదు.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన పందెంకోడి-2 సినిమాకు కూడా సీక్వెల్ తీస్తానంటున్నాడు ఈ హీరో. అంటే.. త్వరలోనే విశాల్-లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి-3 కూడా రాబోతోందన్నమాట. పందెంకోడి ఫ్రాంచైజీకి సంబంధించి 2 సినిమాల మధ్య 13 ఏళ్ల గ్యాప్ తీసుకున్న విశాల్.. ఈసారి రెండేళ్ల గ్యాప్ లోనే పార్ట్-3 తీసుకొస్తానంటున్నాడు.

First Published:  29 Oct 2018 9:45 PM GMT
Next Story