Telugu Global
NEWS

శ్రీనివాసరావును ప్రాణాలతో ఉండనివ్వరా?

బిర్యానీలు తింటూ, పోలీసులతో కబుర్లు చెబుతూ చలాకీగా గడిపిన నిందితుడు శ్రీనివాసరావు హఠాత్తుగా చాతీతో పాటు ఎడమ చేయి తీవ్ర నొప్పి పెడుతోందంటూ నీరసించిపోవడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావును పోలీసులు చేతులపై ఎత్తుకెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. శ్రీనివాసరావు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నిజాలు బయట పడతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు అతడికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. గతంలో మల్లెల బాబ్జీని కూడా ఇదే […]

శ్రీనివాసరావును ప్రాణాలతో ఉండనివ్వరా?
X

బిర్యానీలు తింటూ, పోలీసులతో కబుర్లు చెబుతూ చలాకీగా గడిపిన నిందితుడు శ్రీనివాసరావు హఠాత్తుగా చాతీతో పాటు ఎడమ చేయి తీవ్ర నొప్పి పెడుతోందంటూ నీరసించిపోవడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావును పోలీసులు చేతులపై ఎత్తుకెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు.

శ్రీనివాసరావు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా నిజాలు బయట పడతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు అతడికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.

గతంలో మల్లెల బాబ్జీని కూడా ఇదే తరహాలో చంద్రబాబు అంతం చేశారని గుర్తు చేస్తున్నారు. తనను కేజీహెచ్ కు తరలించే సమయంలోనూ శ్రీనివాసరావు తనకు ప్రాణహాని ఉందని విలేకర్ల వద్ద వాపోయాడు.

ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో నేరుగా స్పందించారు. శ్రీనివాసరావు అస్వస్థతకు గురవడం, అతడిని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.

జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన జునుపల్లి శ్రీనివాస్‌ను ముందుగా అనుకున్న పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ప్రశ్నించారు.

హత్యాప్రయత్నం జరిగిన వెంటనే డీజీపీతో పాటు అధికారపార్టీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తుంటే వారి కుట్రాలోచనలు స్పష్టంగా అర్థమవుతున్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

First Published:  30 Oct 2018 7:23 AM GMT
Next Story