Telugu Global
NEWS

వన్డే క్రికెట్లో అహో! విరాట్...ఒహో! రోహిత్

రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్లు వెస్టిండీస్ తో ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో…. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల హోరు, సెంచరీల జోరుతో రికార్డుల మోత మోగించారు. విశాఖ వేదికగా ముగిసిన రెండో వన్డేలో కొహ్లీ అజేయ సెంచరీ సాధించడం ద్వారా…. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని చేరిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ […]

వన్డే క్రికెట్లో అహో! విరాట్...ఒహో! రోహిత్
X
  • రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్లు

వెస్టిండీస్ తో ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో…. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల హోరు, సెంచరీల జోరుతో రికార్డుల మోత మోగించారు.

విశాఖ వేదికగా ముగిసిన రెండో వన్డేలో కొహ్లీ అజేయ సెంచరీ సాధించడం ద్వారా…. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని చేరిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశాడు.

కొహ్లీ సెంచరీల హ్యాట్రిక్ రికార్డు….

మాస్టర్ సచిన్ 10వేల పరుగులు సాధించడానికి 259 ఇన్నింగ్స్ ఆడితే…. కొహ్లీ మాత్రం 205 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

10వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరిన ఐదో భారత ఆటగాడిగా, ఓవరాల్‌ 13వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కొహ్లీకి ముందే 10వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో సచిన్‌, గంగూలీ, ద్రావిడ్‌, ధోనీ ఉన్నారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ 10వేల పరుగుల రికార్డుతో పాటు …38 వన్డే శతకాలు….వరుసగా మూడు వన్డే సెంచరీలు సాధించడం ద్వారా వారేవ్వా! అనిపించుకొంటే….వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 150కి పైగా స్కోర్లు సాధించడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

150కి పైగా స్కోర్ల మొనగాడు రో….హిట్ శర్మ…

వెస్టిండీస్ పై కెప్టెన్ విరాట్ కొహ్లీ… వరుసగా మూడు సెంచరీలతో అరుదైన ఘనత సాధిస్తే… వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం…. ఏడోసారి 150కి పైగా స్కోరు సాధించి… ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ముంబై వేదికగా…వెస్టిండీస్ తో ముగిసిన నాలుగో వన్డేలో 162 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తన రికార్డును తానే మెరుగు పరచుకొన్నాడు. గౌహతీలో ముగిసిన తొలివన్డే ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఐదు 150 స్కోర్ల రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఏడోసారి అదే ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ముంబై వన్డే వరకూ రోహిత్ శర్మ సాధించిన మొత్తం 21 సెంచరీలలో ఏడు 150కి పైగా స్కోర్లు ఉండటం విశేషం.

మూడు డబుల్ సెంచరీల ఒకే ఒక్కడు….

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా పై 209, కోల్ కతా వేదికగా 2014లో శ్రీలంకపై 264 పరుగులు, 2015లో కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికా పై 150 స్కోరు, 2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా పై 171 నాటౌట్ స్కోరు, 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 208, వెస్టిండీస్ తో గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల నాటౌట్, ముంబై వన్డేలో 162 పరుగుల స్కోరు రికార్డులను కేవలం రోహిత్ శర్మ మాత్రమే సాధించాడు.

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మే కావడం మరో రికార్డు.

First Published:  30 Oct 2018 10:25 AM GMT
Next Story