Telugu Global
NEWS

శ్రీనివాస్‌ ఆస్పత్రికి తరలింపు

జగన్‌పై కత్తితో తెగబడ్డ శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించారు. నిన్న బిర్యానీలు తింటూ దర్జాగా గడిపిన శ్రీనివాసరావు ఒక్కసారిగా ఈరోజు తనకు బాగా నొప్పి ఉందంటూ చెబుతున్నాడు. ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించారు. గుండెలో దడగా ఉందని, ఎడమ చేయి బాగా నొప్పిగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. పరీక్షలు చేసిన వైద్యుడు దేవుడు బాబు .. బీపీ, పల్స్‌ నార్మల్‌గానే ఉన్నాయని నిర్ధారించారు. అయినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో […]

శ్రీనివాస్‌ ఆస్పత్రికి తరలింపు
X

జగన్‌పై కత్తితో తెగబడ్డ శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించారు. నిన్న బిర్యానీలు తింటూ దర్జాగా గడిపిన శ్రీనివాసరావు ఒక్కసారిగా ఈరోజు తనకు బాగా నొప్పి ఉందంటూ చెబుతున్నాడు. ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించారు. గుండెలో దడగా ఉందని, ఎడమ చేయి బాగా నొప్పిగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు.

పరీక్షలు చేసిన వైద్యుడు దేవుడు బాబు .. బీపీ, పల్స్‌ నార్మల్‌గానే ఉన్నాయని నిర్ధారించారు. అయినప్పటికీ నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో శ్రీనివాసరావును ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించామని డాక్టర్ దేవుడు బాబు చెప్పారు.

అయితే బిర్యానీలు తింటూ, పోలీసులతో కబుర్లాడుతూ గడిపిన శ్రీనివాసరావు ఇప్పుడు నొప్పిగా ఉందని చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఆస్పత్రికి తరలించే సమయంలో శ్రీనివాసరావును పోలీసులు చేతులపై ఎత్తుకెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టారు. హఠాత్తుగా శ్రీనివాసరావు ఇలా అవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  30 Oct 2018 6:00 AM GMT
Next Story