Telugu Global
NEWS

యూఎస్‌ నుంచి వైసీపీపై శివాజీ ఫైర్

ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చెప్పిన కమెడియన్ శివాజీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. దాడి సమయానికి శివాజీ అమెరికా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే ఆయన లైవ్‌లో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఒక చానల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన శివాజీ… వైసీపీపై మండిపడ్డారు. తనను టార్గెట్‌ చేస్తే వైసీపీకే నష్టమని హెచ్చరించారు. తనకు అందిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టానన్నారు. అప్రమత్తంగా ఉండాలనే తాను ఆ వివరాలు బయటపెట్టానన్నారు. […]

యూఎస్‌ నుంచి వైసీపీపై శివాజీ ఫైర్
X

ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చెప్పిన కమెడియన్ శివాజీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. దాడి సమయానికి శివాజీ అమెరికా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో అక్కడి నుంచే ఆయన లైవ్‌లో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఒక చానల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన శివాజీ… వైసీపీపై మండిపడ్డారు. తనను టార్గెట్‌ చేస్తే వైసీపీకే నష్టమని హెచ్చరించారు.

తనకు అందిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టానన్నారు. అప్రమత్తంగా ఉండాలనే తాను ఆ వివరాలు బయటపెట్టానన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయాల్సిన దుస్థితి తనకు లేదన్నారు. తాను ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పిన రోజు…. వడ, పరోటా అంటూ హేళన చేశారన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందన్నది జగన్‌ను ఉద్దేశించి కాదని… తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే చెప్పానన్నారు.

వైసీపీ చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ప్రజల మీద నమ్మకం లేదని చెప్పడమేనన్నారు. తాను హెచ్చరించినప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందన్నారు. జగన్‌పై దాడి జరిగిన సమయంలో తాను అమెరికాలో ఉండడం దానికి దీనికి సంబంధం లేదని అంశమన్నారు. తన కుమారుడి కోసమే అమెరికా వెళ్లానన్నారు. నాలుగేళ్లుగా తనకు ప్రాణహాని ఉందన్నారు. ఎప్పుడు రావాలో చెప్పండి.. ఢిల్లీకైనా వస్తా… హైదరాబాద్‌కైనా వస్తా అని సవాల్ చేశారు.

అందరూ కలిసి చంద్రబాబును కుర్చీ మీద నుంచి పడేయడానికి ప్రయత్నిస్తున్నారని శివాజీ ఆరోపించారు. ప్రజా ఉద్యమాలపై తనకంటూ ఒక చరిత్ర ఉందన్నారు. తనకు సినిమాలు లేవని రోజా చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఆమెకేమైనా వేల సినిమాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయి ఉండి నియోజవకర్గంలో పని మానేసి ఈమె ప్రోగ్రాంలు చేసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రోజా రాజకీయం, అరుపులు, రంకెలు ఏంటో అర్థం కావడం లేదన్నారు.

నిన్నటి వరకు పెరుగు వడ అంటూ హేళన చేసిన వారు ఇప్పుడు తనపై ఎందుకు పడుతున్నారని మండిపడ్డారు. తనను ఎందుకు బొక్కలో వేస్తారు.. వేసినా బెయిల్‌పై బయటకు వస్తా అని వ్యాఖ్యానించారు. తన జోలికి వస్తే వారికే ఇబ్బంది అని హెచ్చరించారు. శివాజీ గురించి విచారణ జరిపితే పీఠాలు కదిలిపోతాయన్నారు. తనపై విచారణ జరపాలంటే అంతకు ముందే ఎవరెవరిని విచారణ జరిపించాల్సి ఉంటుందన్న దానిపై తన లాయర్లు లిస్ట్‌ను తయారు చేశారన్నారు.

చంద్రబాబు ఇచ్చిన కోట్ల రూపాయల డబ్బు తీసుకెళ్లి అమెరికాలో గాంబ్లింగ్‌ ఆడుతున్నారన్న ఆరోపణలను శివాజీ ఖండించారు. తన సొంత డబ్బుతో ఆడుకుంటే దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్నారు. తాను తెగించి బతుకుతున్నానని చెప్పారు. చంద్రబాబుపైనా దాడి జరిగే అవకాశం ఉందని శివాజీ జోస్యం చెప్పారు. తనను జాతీయ స్థాయిలో హీరోను చేయాలనుకుంటే కేసులు పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు.

శివాజీని బొక్కలో వేసి కుమ్మితే అంటున్నారు… అలా కుమ్మే హక్కు రాజ్యాంగంలో లేదని…. ముందు పుస్తకాలు చదువుకుని మాట్లాడాలని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు ధోరణి మార్చుకోవాలన్నారు. వీళ్లు వస్తే ఎగబడి కొడతారన్న భావనను వారే కలిగించుకుంటున్నారని శివాజీ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను నమ్మమంటారు.. కానీ సీఎం కుర్చీ కావాలంటున్నారని మండిపడ్డారు. తన జోలికి వస్తే శివాజీ హీరో అవుతారే గానీ వైసీపీకి ఏమీ రాదన్నారు.

First Published:  30 Oct 2018 9:29 PM GMT
Next Story