రైలు పట్టాలు ప్రజా శ్రేయస్సుకేనా? 

రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా ప్రాణ నష్టం, గాయాలపాలు కావడంతో పాటు వాస్తవాలు కూడా వక్రీకరణకు గురవుతాయి. తప్పెవరిది అన్న విషయంలో పరస్పర నిందారోపణలు చెలరేగుతాయి. అక్టోబర్ 19వ తేదీన అమృత్సర్ వద్ద రైలు పట్టాల మీద ఎదురైన మహా విషాదంలో కూడా పరస్పర నిందారోపణలు విచ్చలవిడిగా వినిపించాయి.

ఈ దుర్ఘటనలో 60 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాదాన్ని నివారించడానికి ఎవరు ఏమి చేయవలసింది అన్న విషయంలో అనేక వాదనలు వినిపించాయి. రైలు చోదకుడు వేగం తగ్గించి ఉంటే, లేదా జనం రైలు పట్టాలపై గుమిగూడకుండా ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్న మాటలూ జోరుగానే సాగాయి.

ఈ పరస్పర నిందారోపణలు ఎంతటి అసంబద్ధమైనవిగా ఉన్నాయంటే పట్టాలపై గుమిగూడిన వారు సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమై ఉండకపోతే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న దాకా వెళ్లాయి. ఒక రాజకీయ పార్టీ వారు దసరా సందర్భంగా జరిగిన ఉత్సవానికి హాజరు కాకుండా ఉన్నా ఈ విషాదం నివరించగలిగేవాళ్లం అని కూడా అన్న వారున్నారు. అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేదని అన్నారు.

తప్పు ఎదుటివారి మీదకు నెట్టి తమ దోషం ఏమీ లేదని రుజువుచేసుకోవడానీకే ఈ పరస్పర నిందారోపణలు ఉపయోగపడతాయి. బాధ్యత ఎవరిది అన్న విషయంలో ఎదుటి వారి మీద ఆరోపణలు మోపడంలో రాజకీయ దురుద్దేశాలు లేవని కాదు.

కాని అడగవలసిన ప్రశ్న ఏమిటంటే రైలు పట్టాలకు ఉన్న విశిష్టత ఏమిటి? రైలు పట్టాలకు పక్కన ఉండే ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. జనం అప్పుడప్పుడు రైలు పట్టాలకు చేరువలో ఉన్న స్థలంలో ఎందుకు గుమిగూడుతారు?

రైలు పట్టాలకు సంబంధించిన అంశంపై ఊహాపోహలు, వలసవాద యుగం తర్వాత వెలువడిన రాతల్లో కూడా బోలెడు వైరుధ్యం కనిపిస్తుంది. గాంధేయ ఆలోచనా విధానం ప్రభావానికి లోనైన వారు రైలు పట్టాలు భూభాగాన్ని చీల్చుకుని వెళ్తాయని, భూమి గుండెల్లోంచి వెళ్తాయని రాసిన సాహిత్యకారులూ ఉన్నారు. వలసవాద అనంతరం ప్రచలితంగా ఉన్న దృక్పథాన్ని అనుసరించే వారు కొండలు గుట్టాలను చీల్చి ప్రభుత్వం రైలు మార్గాలు ఏర్పాటు చేయడాన్ని తప్పు పడతారు.

ప్రజోపయోగం కోసం ఏర్పడిన రైలు మార్గాలు ప్రైవేటు భూమి ద్వారా వెళ్తాయి. ఆ భూమి ఒకప్పుడు రైతులది అంటారు. రైలు పట్టాల పక్కన ఉన్న భూమి జనానికి సంబంధించింది. ఆ భూమిని నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికో, ఉత్సవాలు నిర్వహించడానికో వాడతారు. చాలా పట్టణాల్లో ఈ భూభాగాన్ని దసరా ఉత్సవాలలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.

రైలు మార్గం పక్కన ఉన్న భూమిని వాడుకోవడం తాత్కాలికంగానో, మరో రకంగానో వాడుకోవడం ఆచారం అనుకుంటారు. ఈ భూమిని ఇళ్లు కట్టుకోవడానికి శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగిస్తే అప్పుడప్పుడు ఉత్సవాలు నిర్వహించుకోవడానికి తాత్కాలికంగా వాడుతుంటారు. సైన్యానికి సంబంధించిన భూమి చుట్టుపక్కల ఇలా వినియోగించుకోవడం అరుదు. కాని రైలు మార్గాల పక్కన ఉన్న స్థలాన్ని యదేచ్ఛగా వాడుతుంటారు. అలా వాడడాన్ని అడ్డుపెట్టడం కూడా తక్కువే.

ఉదాహరణకు ముంబైలో ప్రయాణికులు తాము పని చేసే చోటికి త్వరగా చేరుకునే హడావుడిలో ఉంటారు. ఈ హడావుడిలో రైలు ఎంత వేగంగా వస్తుందో గమనించకపోవచ్చు. అందుకని రైలు పట్టాలు దాటేస్తుంటారు. గత నాలుగేళ్ల కాలంలో ముంబైలో 20,000 మంది పట్టాలు దాటుతూ మరణించారని, కనీసం అంతమంది తీవ్ర ప్రమాదానికి గురైనారని మీడియా వార్తలవల్ల తెలుస్తోంది.

రైళ్లలో ప్రయాణించే మధ్యతరగతి జీవుల, రైల్వే వారి వైఖరి సైతం పట్టాల పక్కన నివసించే వారి విషయంలో ఎంత మాత్రం సానుభూతి లేకుండా ఉంటుంది. రోజూ రైళ్లల్లో వెళ్లే వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా రైలు పట్టాల పక్కన మురికివాడల్లో నివసించే వారంటే చిరాకు పడుతూ ఉంటారు. అసహ్యించుకుంటారు.

రైల్వేలకు, మానవులకు మధ్యన ఉన్న ఉద్రిక్తతను చూసినా తమకు ప్రాణాప్రాయం ఉందని తెలిసినా జనం పట్టాల మీదకు వస్తారా? వారు హడావుడిగా వెళ్తుంటారు కనక ముప్పు తప్పడం లేదు. రైలు బయలు దేరి జనాన్ని వేటాడుతూ వెళ్తుంది అని కూడా చెప్పలేం. లేదా నివాస ప్రాతాలలోకి దూసుకెళ్తుంది అని కూడా అనలేం. పట్టాల మీద పోగైన జనం మీచి వెళ్తుంది అని కూడా అనుకోలేం. రైళ్లు శాస్త్రబద్ధమైన తర్కం ఆధారంగా నడుస్తాయి. జనం ఆందోళన, హడావుడి ప్రదర్శిస్తారు.

(ఎకనామిక అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)