Telugu Global
Cinema & Entertainment

"సవ్యసాచి" కి మాధవన్ పెట్టిన కండిషన్ ఏంటి ?

అక్కినేని నాగ చైతన్య నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “సవ్యసాచి”. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించాడు. దాదాపు పది పదిహేనేళ్ళ తరువాత మాధవన్ తెలుగు లో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే “సవ్యసాచి” విలన్ రోల్ లో నటించడానికి ముందు “సవ్యసాచి” టీమ్‌కి ఒక కండిషన్ పెట్టాడు అంట మాధవన్. దానికి సరేనంటేనే సినిమా చేస్తానని చెప్పాడు అంట. అదేంటంటే ‘‘సవ్యసాచి”ని తమిళంలో విడుదల […]

సవ్యసాచి కి మాధవన్ పెట్టిన కండిషన్ ఏంటి ?
X

అక్కినేని నాగ చైతన్య నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా “సవ్యసాచి”. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించాడు. దాదాపు పది పదిహేనేళ్ళ తరువాత మాధవన్ తెలుగు లో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే “సవ్యసాచి” విలన్ రోల్ లో నటించడానికి ముందు “సవ్యసాచి” టీమ్‌కి ఒక కండిషన్ పెట్టాడు అంట మాధవన్. దానికి సరేనంటేనే సినిమా చేస్తానని చెప్పాడు అంట.

అదేంటంటే ‘‘సవ్యసాచి”ని తమిళంలో విడుదల చేయకూడదని. అందుకు దర్శకుడు, నిర్మాతలు సరేనని ఒప్పుకున్నారు. సినిమా చేశారు. అందుకని సినిమాను తమిళంలో డబ్బింగ్‌ చేయలేదు. “సవ్యసాచి”ని తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని మాధవన్‌ భావించడంతో దర్శక నిర్మాతలు సరేనని అనక తప్పలేదు. మరి చాలా కాలం తరువాత తెలుగు లో సినిమా చేస్తున్న మాధవన్ ఈ సినిమాతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేసారు. నవంబర్ 2 న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయ్యింది.

First Published:  31 Oct 2018 12:22 AM GMT
Next Story