Telugu Global
CRIME

ప్రియుడితో సాఫ్ట్‌వేర్‌ ఇంజ‌నీర్ భార్య ఎఫైర్ ! భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ పంజాగుట్టలో సూసైడ్ చేసుకున్న‌ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆడియో టేపుల‌తో ప్ర‌శాంత్ భార్య పావ‌నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్థిస్థాయిలో విచార‌ణ చేస్తున్నారు. పావ‌ని త‌న ప్రియుడు ప్ర‌ణ‌య్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల్లే ప్ర‌శాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. వ‌రంగ‌ల్‌కు చెందిన పావ‌నికి కామారెడ్డికి చెదిన ప్ర‌శాంత్‌తో 2014లో పెళ్లి అయింది. హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లుగా ప‌నిచేస్తున్నారు. పావనికి పెళ్లికి ముందే […]

ప్రియుడితో సాఫ్ట్‌వేర్‌ ఇంజ‌నీర్ భార్య ఎఫైర్ ! భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌
X

హైద‌రాబాద్ పంజాగుట్టలో సూసైడ్ చేసుకున్న‌ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆడియో టేపుల‌తో ప్ర‌శాంత్ భార్య పావ‌నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్థిస్థాయిలో విచార‌ణ చేస్తున్నారు. పావ‌ని త‌న ప్రియుడు ప్ర‌ణ‌య్‌తో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల్లే ప్ర‌శాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

వ‌రంగ‌ల్‌కు చెందిన పావ‌నికి కామారెడ్డికి చెదిన ప్ర‌శాంత్‌తో 2014లో పెళ్లి అయింది. హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లుగా ప‌నిచేస్తున్నారు. పావనికి పెళ్లికి ముందే ప్రణయ్ తో పరిచయం ఉంది. ఈ మ‌ధ్య‌ ప్ర‌ణ‌య్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది.

ఇటీవ‌లే పావ‌ని బెంగ‌ళూరుకు జాబ్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకుని…. అక్క‌డే ప్ర‌ణ‌య్ తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేయ‌డం మొద‌లుపెట్టింది. ఈ విష‌యం తెలిసిన ప్ర‌శాంత్‌… క‌లిసి కాపురం చేద్దామ‌ని పావ‌నిని కోరాడు. అయితే తాను ప్ర‌ణ‌య్‌తోనే ఉంటాన‌ని ఆమె తేల్చిచెప్ప‌డంతో రెండునెలలుగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిన ప్ర‌శాంత్ మంగ‌ళ‌వారం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ప్రశాంత్ తాను చనిపోవడానికి వారం ముందు తన బావకు ఫోన్ చేసి తాను చనిపోతానని తనకు బతకాలని లేదని ఫోన్ లో చెప్పాడు. అవమాన భారంతో బతకలేనని, తాను చనిపోతే కనీసం ప్రశాంతంగానైనా ఉంటానని ఫోన్ లో మాట్లాడాడు.

ప్రశాంత్ మాటలతో అతని బావ…. నువ్వు చచ్చి ఏం సాధిస్తావు… ఒక ఆడది బహిరంగంగా తాను తప్పు చేశానని చెప్పాక ఆడదానికి అంత ఉంటే మగాడివి నీకెందుకురా భయం… కోర్టులో తేల్చుకున్నాక ఆలోచిద్దాం.. అటువంటి ఆలోచనలు వద్దు… జీవితం ఏం అయిందని….. నీవు తప్పు చేయలేదు. అంటూ ధైర్యం చెప్పాడు.

ఇప్పుడు ఈ ఆడియో బయటపడింది. త‌న భార్య ఎన్ని సార్లు చెప్పినా మార‌లేద‌ని…. అందుకు తాను చ‌నిపోతున్నానని ప్ర‌శాంత్ సూసైడ్ నోట్‌లో రాశాడు.

First Published:  31 Oct 2018 4:02 AM GMT
Next Story