హస్తాలు మృదువుగా ఉండాలంటే…

 ఇంటిపని, వంటపని, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం వంటి పనులతో చేతులకు మృదుత్వం పోయి గరుకుగా మారిపోతున్నాయని అతివలు ఆందోళన చెందుతుంటారు. అటువంటి వారి కోసం కొన్ని చిట్కాలు…
 – కొద్దిగా గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ లేదా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.
 – రాత్రిపూట పడుకోబోయే ముందు వేజలైన్, కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు మర్దనా చేస్తే తెల్లవారే సరికి చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
 – బట్టలు ఉతికేటపుడు సబ్బులు, డిటర్జంట్‌ల మూలంగా చేతులకు హాని కలిగే అవకాశం ఉంటుంది. చేతులకు రక్షణగా గ్లవ్స్ వాడడం మంచిది.
 – బట్టలు ఉతకడం పూర్తయ్యాక వెంటనే చేతులకు వెనిగర్‌ని కానీ, నిమ్మరసం గానీ రాసుకుని ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఏవైనా మరకలు అంటినా పోతాయి. చేతులు మృదువుగా ఉంటాయి.
 – మోచేతుల వద్ద కొంతమందికి నలుపు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు నిమ్మ చెక్కతో రుద్దుకుంటే ఆ నలుపు పోతుంది.
 – చేతులను ఐదు నిమిషాలు గోరువెచ్చని నీటిలో ఉంచినా మృదువుగా, నాజూకుగా ఉంటాయి.
 – కొంచెం నిమ్మరసం, కొంచెం పంచదార కలిపి చేతులకు పట్టించి మర్దనా చేసుకున్నా చేతులకుండే బిరుసుతనం పోతుంది.