“వెంకీ మామ” సినిమా కథ ఇదేనా ?

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఇద్దరు కలిసి “వెంకీ మామ” అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. “జై లవ కుశ” ఫేం బాబీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తం లో వెంకటేష్ ఇంకా నాగ చైతన్య కి మధ్య వచ్చే సీన్ బాగుంటాయి అని ఫిలిం నగర్ టాక్. కమర్షియల్ ఎంటర్టైనర్ గా భావించబడుతున్న ఈ చిత్ర నేపథ్యంలో జ్యోతిషశాస్త్రం మరియు మానవ జీవితంపై దాని ప్రభావాన్ని చిత్రీకరించనున్నారట మూవీ యూనిట్.

ఈ సినిమాలో జ్యోతిషశాస్త్రం కారణంగా వెంకటేష్ మరియు నాగ చైతన్య మధ్య తలెత్తిన సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం యొక్క ప్రధాన ముఖ్యాంశాలు వెంకీ మరియు చైతన్య మధ్య తేడాలు మరియు వారు ఎదుర్కొనే పరిణామాలు ఉంటాయట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అలాగే బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సురేష్ బాబు కూడా జత కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.