Telugu Global
NEWS

కాంగ్రెస్ జాబితా మ‌ళ్లీ వాయిదా!

తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. శుక్ర‌వారం విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశం త‌ర్వాత జాబితా విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఈనెల‌8న మ‌రోసారి కేంద్ర ఎన్నికల క‌మిటీ స‌మావేశం కాబోతుంది. ఈ స‌మావేశం త‌ర్వాత జాబితా విడుద‌ల చేయ‌బోతున్నారు. గురువారం జ‌రిగిన స‌మావేశంలో 62 మంది అభ్య‌ర్థుల‌పై చ‌ర్చించారు.ఇందులో 57 మంది అభ్య‌ర్థులను పైన‌ల్ చేశారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయ‌బోతుంది. మిత్ర‌ప‌క్షాల‌కు 24 […]

కాంగ్రెస్ జాబితా మ‌ళ్లీ వాయిదా!
X

తెలంగాణ కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. శుక్ర‌వారం విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఎన్నిక‌ల క‌మిటీ స‌మావేశం త‌ర్వాత జాబితా విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఈనెల‌8న మ‌రోసారి కేంద్ర ఎన్నికల క‌మిటీ స‌మావేశం కాబోతుంది. ఈ స‌మావేశం త‌ర్వాత జాబితా విడుద‌ల చేయ‌బోతున్నారు.

గురువారం జ‌రిగిన స‌మావేశంలో 62 మంది అభ్య‌ర్థుల‌పై చ‌ర్చించారు.ఇందులో 57 మంది అభ్య‌ర్థులను పైన‌ల్ చేశారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయ‌బోతుంది. మిత్ర‌ప‌క్షాల‌కు 24 సీట్లు కేటాయించారు. ఇందులో టీడీపీకి 14, టీజేఎస్‌, సీపీఐకి 10 స్థానాలు కేటాయించారు.

అయితే మిత్ర‌ప‌క్షాల సీట్ల‌పై పంచాయ‌తీ న‌డుస్తోంది. సీపీఐ ఆరు సీట్లు ఇవ్వాల‌ని కోరుతోంది. ఇటు రేపు కోదండ‌రాంతో రాహుల్‌గాంధీ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశం త‌ర్వాత సీట్ల‌పై పూర్తిస్థాయి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే అహ్మ‌ద్‌ప‌టేల్‌తో సీపీఐ నేత‌లు చ‌ర్చ‌లు జరుపుతున్నారు. త‌మ‌కు ఆరు సీట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కోదండ‌రాం కూడా 10 సీట్లు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

First Published:  1 Nov 2018 5:09 AM GMT
Next Story