Telugu Global
NEWS

రాహుల్ ద్రావిడ్ కు హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం

హాల్ ఆఫ్ ఫేమ్ అందుకొన్న 5వ భారత క్రికెటర్ ద్రావిడ్ బేడీ, కపిల్, గవాస్కర్, కుంబ్లేల సరసన ద్రావిడ్ టీమిండియా మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్…అరుదైన గౌరవం సంపాదించాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం అందుకొన్న భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో…ద్రావిడ్ కు…హాల్ ఆఫ్ ఫేమ్ ధృవీకరణ జ్ఞాపికను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అందచేశారు. […]

రాహుల్ ద్రావిడ్ కు హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం
X
  • హాల్ ఆఫ్ ఫేమ్ అందుకొన్న 5వ భారత క్రికెటర్ ద్రావిడ్
  • బేడీ, కపిల్, గవాస్కర్, కుంబ్లేల సరసన ద్రావిడ్

టీమిండియా మాజీ కెప్టెన్, ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్…అరుదైన గౌరవం సంపాదించాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారం అందుకొన్న భారత ఐదో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో…ద్రావిడ్ కు…హాల్ ఆఫ్ ఫేమ్ ధృవీకరణ జ్ఞాపికను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అందచేశారు.

2018 జులైలోనే ఐసీసీ…రాహుల్ ద్రావిడ్ తోపాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్, మహిళా క్రికెట్ దిగ్గజం క్లెయిర్ టేలర్ లకు…హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణంగా రాణించడంతో పాటు..అరుదైన రికార్డులు నెలకొల్పిన కారణంగా ఈ ముగ్గురు క్రికెటర్లను గౌరవించినట్లు ఐసీసీ ప్రకటించింది.

గతంలో హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలు అందుకొన్న భారత క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనీల్ కుంబ్లే, బిషిన్ సింగ్ బేడీ ఉన్నారు. 2009లో బేడీ, కపిల్, గవాస్కర్ లకు, 2015లో అనీల్ కుంబ్లే..అరుదైన ఈ గౌరవం అందుకొన్నారు. ఆ తర్వాత…రాహుల్ ద్రావిడ్ మాత్రమే…హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించాడు.

First Published:  1 Nov 2018 11:35 AM GMT
Next Story