Telugu Global
Cinema & Entertainment

రవితేజ సరసన "ఆర్ ఎక్స్ 100″బ్యూటీ

మాస్ మహారాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే రవితేజ రెండు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. అందులో ఒకటి వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తుంటే, మరో సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ముందుగా వి.ఐ ఆనంద్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకు సంబందించిన […]

రవితేజ సరసన ఆర్ ఎక్స్ 100″బ్యూటీ
X

మాస్ మహారాజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే రవితేజ రెండు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. అందులో ఒకటి వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తుంటే, మరో సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ముందుగా వి.ఐ ఆనంద్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తుంటే మరో హీరోయిన్ గా పాయల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటివలే రిలీజ్ అయిన “ఆర్ ఎక్స్ 100” సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన పాయల్ ఈ సినిమా ఆఫర్ అదృష్టం అనే చెప్పాలి. మరి మాస్ మహారాజ్ రవితేజ పక్కన ఈ హాట్ బ్యూటీ ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందో చూడాలి.

First Published:  1 Nov 2018 1:29 AM GMT
Next Story