Telugu Global
NEWS

విండీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా షో

3-1తో సిరీస్ నెగ్గిన విరాట్ సేన విండీస్ ప్రత్యర్థిగా టీమిండియా వరుసగా ఎనిమిదో సిరీస్ గెలుపు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విరాట్ కొహ్లీ 5 మ్యాచ్ ల్లో విరాట్ 453 పరుగులు వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. 9వ ర్యాంకర్ వెస్టిండీస్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-1తో సొంతం చేసుకొంది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో టీమిండియా 9 వికెట్లతో విండీస్ […]

విండీస్ తో వన్డే సిరీస్ లో టీమిండియా షో
X
  • 3-1తో సిరీస్ నెగ్గిన విరాట్ సేన
  • విండీస్ ప్రత్యర్థిగా టీమిండియా వరుసగా ఎనిమిదో సిరీస్ గెలుపు
  • ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా విరాట్ కొహ్లీ
  • 5 మ్యాచ్ ల్లో విరాట్ 453 పరుగులు

వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. 9వ ర్యాంకర్ వెస్టిండీస్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-1తో సొంతం చేసుకొంది. తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి వన్డేలో టీమిండియా 9 వికెట్లతో విండీస్ ను చిత్తు చేసింది. రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

రవీంద్ర జడేజా జాదూ….

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో టీమిండియా సిరీస్ విజయాల జైత్రయాత్ర కొనసాగుతోంది. గత మూడువారాలుగా .. 9వ ర్యాంకర్ వెస్టిండీస్ తో జరిగిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ ను సైతం టీమిండియా 3-1తో నెగ్గి…కరీబియన్ టీమ్ పై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకొంది.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ వేదికగా ముగిసిన ..నిర్ణయాత్మక ఆఖరివన్డేను టీమిండియా 9 వికెట్లతో అలవోకగా నెగ్గి సిరీస్ విజేతగా నిలిచింది. ఈ కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గి…ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న విండీస్ టీమ్ 31.5 ఓవర్లలో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది.

టీమిండియా బౌలర్లలో జాదూ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లు, బుమ్రా, ఖలీల్ చెరో రెండు వికెట్లు, కుమార్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.

105 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన టీమిండియాకు… ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ… రెండో వికెట్ కు…99 పరుగుల అజేయ భాగస్వామ్యంతో…14.5 ఓవర్లలోనే అలవోక విజయం అందించారు.

రోహిత్ శర్మ 5 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 63, విరాట్ కొహ్లీ 33 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కొహ్లీ…

దీంతో…9వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా 3-1తో సిరీస్ ట్రోఫీ అందుకొంది. టీమిండియా విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్నర్ జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. విరాట్ కొహ్లీ మొత్తం ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ లో మూడు శతకాలతో పాటు 453 పరుగులు సాధించడం విశేషం.

వరుసగా 8వ సిరీస్ గెలుపు…

విండీస్ ప్రత్యర్థిగా టీమిండియాకు ఇది 59వ వన్డే విజయం కాగా….వరుసగా ఎనిమిదో సిరీస్ విజయం కావడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా ఆరో ద్వైపాక్షిక సిరీస్ విజయం కాగా…2015 సిరీస్ నుంచి…టీమిండియా అజేయంగా ఉంటూ వస్తోంది.

రాయుడు, ఖలీల్ లకు హ్యాట్సాఫ్…

ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 3-1తో నెగ్గడం పట్ల …టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆట మూడు విభాగాలలోనూ తమజట్టు గొప్పగా రాణించిందని… నాలుగో నంబర్ స్థానంలో అంబటి రాయుడు, మూడోసీమర్ గా ఖలీల్ అహ్మద్ అంచనాలకు మించి రాణించారని…ఈ ఇద్దరికీ… 2019 ప్రపంచకప్ వరకూ తగిన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తామని కొహ్లీ ప్రకటించాడు.

ఐదుమ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ కు తెరపడడంతో…ఇక…తీన్మార్ టీ-20 సిరీస్ కు తెరలేచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 4న తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభమవుతుంది.

First Published:  1 Nov 2018 11:46 AM GMT
Next Story