Telugu Global
National

టీమిండియా " విండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్

టీ-20ల్లో రెండో ర్యాంకర్ టీమిండియా టీ-20ల్లో 7వ ర్యాంకర్ విండీస్ 4న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో తొలి టీ-20 టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. టీ-20 రెండోర్యాంకర్ టీమిండియా, 7వ ర్యాంకర్ విండీస్ జట్లు…ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో సమరానికి సిద్ధమయ్యాయి. జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని కరీబియన్ ఆర్మీ…. టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ధూమ్ ధామ్ టీ-20 వార్…. భారత్ […]

టీమిండియా  విండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్
X
  • టీ-20ల్లో రెండో ర్యాంకర్ టీమిండియా
  • టీ-20ల్లో 7వ ర్యాంకర్ విండీస్
  • 4న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో తొలి టీ-20

టీమిండియా- విండీస్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. టీ-20 రెండోర్యాంకర్ టీమిండియా, 7వ ర్యాంకర్ విండీస్ జట్లు…ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో సమరానికి సిద్ధమయ్యాయి.

జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని కరీబియన్ ఆర్మీ…. టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

ధూమ్ ధామ్ టీ-20 వార్….

భారత్ లో ఆరువారాల …విండీస్ జట్టు పర్యటన ఆఖరి అంచెకు చేరుకొంది. రెండుమ్యాచ్ ల టెస్ట్, పాంచ్ పటాకా వన్డే సిరీస్ లు ముగియడంతో…ఇప్పుడు తీన్మార్ టీ-20 సిరీస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మొదటి మూడు వన్డేల్లో టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చిన విండీస్ జట్టు…టీ-20 సిరీస్ లో అడుగడుగునా గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండుజట్లూ పలువురు యువ ఆటగాళ్లతో పాటు… టీ-20 స్పెషలిస్టులకు జట్టులో చోటు కల్పించడంతో… పోటీ మరింత ఆసక్తికరంగా సాగే అవకాశముంది.

ఆల్ రౌండ్ పవర్ తో విండీస్

సూపర్ ఆల్ రౌండర్లు కీరన్ పోలార్డ్, యాండ్రే రస్సెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో చేరడంతో… జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని విండీస్ జట్టు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది.

వీరబాదుడు కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని విండీస్ ఆటగాళ్లలో కీరాన్ పోలార్డ్, యాండ్రీ రస్సెల్, ఇవిన్ లూయిస్, ఒబెడ్ మెకోయ్, యాష్లే నర్స్, కీమో పాల్, ఖరే పియరీ, రోవ్ మాన్ పావెల్, దీనేశ్ రామ్ దిన్, షెర్ ఫానో రూథర్ ఫోర్డ్, ఒషానే థామస్, డారెన్ బ్రావో. షెర్మాన్ హెట్ మేయర్ ఉన్నారు.

టీమిండియాకు యువరక్తం….

ఇక…..విరాట్ కొహ్లీ కెప్టెన్సీలోని భారతజట్టులో…రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, షాబాజ్ నదీమ్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే, కృణాల్ పాండ్యా, కెెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

ఈడెన్ గార్డెన్స్ లో తొలిసమరం…

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ కు…భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది.

నవంబర్ 4న జరిగే ఈమ్యాచ్ తో….భారత క్రికెట్ అభిమానులకు…మూడురోజుల ముందుగానే దీపావళి పండుగ ప్రారంభంకానుంది.

నవంబర్ 6న లక్నో వేదికగా రెండో టీ-20 నిర్వహిస్తారు. నవంబర్ 11న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మూడో టీ-20తో సిరీస్ తెరపడుతుంది.

టెస్ట్ క్రికెట్లో తేలిపోయి…వన్డే క్రికెట్లో అంచనాలను మించి పోటీ ఇచ్చిన కరీబియన్ టీమ్…టీ-20 సమరంలో…స్థాయికి తగ్గట్టుగా ఆడితే… విరాట్ కొహ్లీ అండ్ కోకు చేతినిండా పనే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  2 Nov 2018 11:30 AM GMT
Next Story