Telugu Global
National

విజయసాయిరెడ్డితో నేషనల్ మీడియా సీనియర్ ఎడిటర్ అంత మాటన్నారా.....

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… చంద్రబాబు, నారా లోకేష్ చెప్పుకునే గొప్పలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ట్విట్టర్‌లో, ఫేస్ బుక్ లో నారావారికి గట్టిగా సమాధానం చెబుతున్నారు. తాజాగా దేశాన్ని ఏకం చేస్తానంటూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నేతలను కలిసి తాను చక్రం తిప్పుతానని చెబుతున్నారు. దేశంలో తనంటి సీనియర్ లేరని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫేస్‌బుక్‌లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు దేశంలో తానే సీనియర్‌ […]

విజయసాయిరెడ్డితో నేషనల్ మీడియా సీనియర్ ఎడిటర్ అంత మాటన్నారా.....
X

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… చంద్రబాబు, నారా లోకేష్ చెప్పుకునే గొప్పలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ట్విట్టర్‌లో, ఫేస్ బుక్ లో నారావారికి గట్టిగా సమాధానం చెబుతున్నారు.

తాజాగా దేశాన్ని ఏకం చేస్తానంటూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడి నేతలను కలిసి తాను చక్రం తిప్పుతానని చెబుతున్నారు. దేశంలో తనంటి సీనియర్ లేరని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫేస్‌బుక్‌లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

చంద్రబాబు దేశంలో తానే సీనియర్‌ అని, తనంత కాలం సీఎంగా చేసిన వారు ఎవరూ లేరని చెబుతున్న నేపథ్యంలో వాస్తవాలేంటో చూడండి అంటూ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. చంద్రబాబు గురించి జాతీయ మీడియా జర్నలిస్టులు ఏమంటున్నారో కూడా వివరించారు.

విజయసాయిరెడ్డి పెట్టిన పోస్టు ఇలా ఉంది…

సిఎంగా ఉండి దేశంలోనే అత్యంత అబద్ధాలకోరు, ఎటువంటి విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరో తెలుసా? అని జాతీయ మీడియా సీనియర్ ఎడిటర్ ఒకరు నన్నడిగాడు. నేను జవాబు చెప్పేలోపే ఆయన కల్పించుకుని మరో పది-ఇరవై ఏళ్ల పాటు అటువంటి (సెల్ఫ్ డబ్బ) గొప్పలు చెప్పుకొనే సిఎం ఇంకెవరూ ఉండక పోవచ్చు అని మరో ఉపమానం జత చేశారు.

మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ “బిగ్ లయ్యర్ సిఎం” తెలుసా అన్నాడు. ఆయన అన్నది నూటికి నూరు శాతం నిజం. తను ఏది చెప్పినా భజన మీడియా పతాక శీర్షికల్లో వార్తలు రాస్తుందనే ధీమాతో పుంఖాను పుంఖంగా సొల్లు మాటలు చెబుతుంటారు. కొన్నేళ్లుగా ఆయన సమయం, సందర్భం చూసుకోకుండా తను దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్తనని కోతలు కోస్తున్నారు.

ప్రస్తుతం జీవించి ఉన్న పొలిటీషియన్లలో తనంత సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారెవరూ లేరని ప్రజల్ని వెర్రివాళ్ళని చేస్తున్నాడు. ఇది ఫేక్ అని తెలిసినా, అసత్యాలు పలకడం అతని DNAలో ఉంది కాబట్టి అందరూ కామెడీగా తీసుకుంటున్నారు.

అబద్దాలను పదే పదే చెప్పి నిజమని నమ్మించే విద్యలో గోబెల్స్ అంశ ఉన్నవాడు కాబట్టి ఒక సారి వాస్తవ మేమిటో అందరికీ తెలియ చెప్పడం కోసమే ఈ చిన్న ప్రయత్నం అంటున్నారు విజయసాయి రెడ్డి.

• దేశంలో బతికున్న రాజకీయ నాయకుల్లో ఎక్కువ కాలం పదవిలో ఉన్న సిఎంగా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు నెలకొల్పారు. 23 ఏళ్ల పాటు పదవిలో ఉండి లాంగెస్ట్ సర్వింగ్ సిఎంగా దివంగత జ్యోతిబసు పేరున ఉన్న రికార్డును చామ్లింగ్ ఆరు నెలల క్రితం బ్రేక్ చేశారు.

ఐదో సారి సిఎం అయిన చామ్లింగ్ 24 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఆయన మొదటి సారి 1994 లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అప్పుడు చంద్రబాబు ఎన్టీరామారావు మత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. చామ్లింగ్ 1994, 1999, 2004, 2009, 2014 సంవత్సరాల్లో వరసగా సిఎం అయ్యారు. ఇప్పటికీ కొనసాగుతున్నారు. అసలు సిక్కిం ఇండియాలో భాగమని చంద్రబాబుకి తెలుసో లేదో? మరి చామ్లింగ్ ఎవరో తెలిసే అవకాశం ఉందా?

•నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ కాళ్ళు, ఇందిరా గాంధీ కాళ్లు పట్టుకుని మొదటి సారి చంద్రబాబు ఏపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే మహారాష్ట్రలో శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 1967 లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసినా చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా మర్చిపోయి ఉంటారు. చరిత్రను పప్పు లోకేశ్ కైనా కరెక్టుగా చెప్పండి. మామను వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ కుట్రతో 1995 లో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే నాటికే శరద్ పవార్ మూడు సార్లు సిఎం అయ్యారు. ఆయన మహారాష్ట్రలోనే కాక, దేశ రాజకీయాల్లో ఇప్పటికీ అందరూ గౌరవించే బలమైన నాయకుడిగా ఉన్నారు.

•శిరోమణి అకాలీ దళ్ (S.A.D) అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ 1957 లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1970 లోనే ఆయన మొదటి సారి పంజాబ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. ఇటీవలి వరకు ఆయన సిఎంగా పని చేశారు. ఆయన నాలుగు దఫాలుగా 19 ఏళ్ల పాటు సిఎంగా పనిచేశారు.

బాదల్ దేశంలోనే అతి చిన్న వయసులో 1970లో సిఎంగా ప్రమాణ శ్రీకారం చేసి రికార్డు సృష్టించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీని ధిక్కరించి జైలు జీవితం కూడా గడిపారు. మరి ఈయన కూడా మీకంటే జూనియరా చంద్రబాబూ?

•ఎల్ కె అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, దేవెగౌడ, తరుణ్ గోగోయ్, వి.సి అచ్యుతానందన్, శరద్ యాదవ్, రాజనాథ్ సింగ్, లాలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, సుశ్మా స్వరాజ్, కమలనాథ్, కరుణా నిధి, నితీష్ కుమార్ లాంటి వారి గురించి తెలియదా లేదా వాళ్లని పరిగణనలోకి తీసుకోరా చంద్రబాబూ? వీళ్ల కంటే మీరే సీనియర్ అని భ్రమ పడుతున్నారా లేక గోబెల్స్ ఆత్మ ప్రవేశించడం వల్ల అలా మాట్లాడుతున్నారా నాయుడు బాబు? అని విజయసాయి రెడ్డి చురకలంటించారు.

•సిఎంగా ఉండి దేశంలోనే అత్యంత అబద్ధాలకోరు, ఎటువంటి విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరో తెలుసా అని జాతీయ మీడియా సీనియర్ ఎడిటర్…

Publiée par Vijay Sai Reddy sur Jeudi 1 novembre 2018

First Published:  2 Nov 2018 11:00 AM GMT
Next Story