Telugu Global
National

ఫిబ్రవరి నుంచి ఓటుకు నోటు కేసు విచారణ

ఫిబ్రవరి నుంచి సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టు స్పందించింది. అయితే ఎన్నికలు ఉన్నాయంటూ విచారణపై టీడీపీ తరపున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. టీడీపీ తీరుకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు విచారణపై అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే […]

ఫిబ్రవరి నుంచి ఓటుకు నోటు కేసు విచారణ
X

ఫిబ్రవరి నుంచి సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టు స్పందించింది. అయితే ఎన్నికలు ఉన్నాయంటూ విచారణపై టీడీపీ తరపున న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

టీడీపీ తీరుకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోర్టు విచారణపై అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. కేసును త్వరగా విచారణ చేయాలని తాము కోర్టును అడిగామని అందుకు కోర్టు అంగీకరించిందన్నారు.

ఎన్నికల పేరుతో విచారణ నుంచి తప్పించుకునేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నించారని కానీ సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదని ఆర్కే చెప్పారు. ఓటుకు నోటు కుట్రదారి చంద్రబాబేనని… రాజకీయ ప్రత్యర్థులు పిటిషన్లు వేశారంటూ విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆర్కే తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు.

First Published:  2 Nov 2018 1:54 AM GMT
Next Story