Telugu Global
NEWS

కాంగ్రెస్ ను వీడేందుకు ‘చిరు’ కో మంచి సాకు

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా, క్లైమాక్స్ చప్పబడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ్ముడు స్థాపించిన జనసేనకు జై కొడతున్నారని బహిరంగంగా వినిపిస్తున్నా, ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. బహుశా కాంగ్రెస్‌ను వీడేందుకు సాకు వెతుకుతున్నారని వినికిడి. ప్రజారాజ్యం స్థాపించిన తొలినాళ్లలో మంచి ఊపు ముందున్న చిరంజీవి గ్రాఫ్.. ఆ తరువాత అంతకంతకు తగ్గుతూ పోయింది. సినిమాల్లో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. వారి అండదండలతో ఖచ్చితంగా […]

కాంగ్రెస్ ను వీడేందుకు ‘చిరు’ కో మంచి సాకు
X

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా, క్లైమాక్స్ చప్పబడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ్ముడు స్థాపించిన జనసేనకు జై కొడతున్నారని బహిరంగంగా వినిపిస్తున్నా, ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. బహుశా కాంగ్రెస్‌ను వీడేందుకు సాకు వెతుకుతున్నారని వినికిడి.

ప్రజారాజ్యం స్థాపించిన తొలినాళ్లలో మంచి ఊపు ముందున్న చిరంజీవి గ్రాఫ్.. ఆ తరువాత అంతకంతకు తగ్గుతూ పోయింది. సినిమాల్లో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. వారి అండదండలతో ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కవచ్చని అనుకున్నారు. రాజకీయాలు చేయడం అంత ఆషామాషీ కాదనే విషయం మెల్లగా బోధపడింది. అనుకునున్నట్టే ఎన్నికల్లో పోటీ చేసి 17 మంది వరకు ఎమ్మెల్యేలను గెలిపించగలిగారు.

తదనంతర పరిమాణాల నేపథ్యంలో ప్రజారాజ్యం ను సోనియాగాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకున్నారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన స్థాపించి ఏపీ మొత్తం తిరుగుతున్నారు.

కాగా, తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో టీఆర్ఎస్ కు దీటుగా దూసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది.. ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో పార్టీలో ఉన్న సినిమా నటులతో కాంపెయిన్ చేయిస్తే కొంత ఉత్సాహం దొరుకుతుందని భావించారు. ఆ మేరకు ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న విజయశాంతిని, చిరంజీవిని ప్రచారానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, అసలు చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటారా అన్న చర్చ మొదలైంది. ఒక వైపు నాగబాబు జనసేనలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బాటలోనే చిరంజీవి కూడా పయనిస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను వీడేందుకు ఏ సాకు చూపాలో అర్థం కాక మౌనంగా ఉంటున్న ఆయనకు, ఇప్పుడో మంచి అవకాశం దొరికిందని సంబరపడిపోతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ అనైతిక దోస్తీ వల్ల ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోయే పరిస్థితి దాపురించింది.

ఇప్పటికే కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వట్టి వసంతకుమార్ ప్రకటించారు. అదే బాటలో చిరంజీవి కూడా పయనించనున్నారని తెలుస్తుంది. ఇటీవల జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్…. అన్నయ్య చిరంజీవి తమతోనే ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి త్వరలో కాంగ్రెస్‌ను వీడటం ఖాయంలా ఉంది.

First Published:  3 Nov 2018 4:37 AM GMT
Next Story