నితిన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న సుకుమార్

చల్ మోహన్ రంగ” “శ్రీనివాస కళ్యాణం” సినిమాలతో ఫ్లాప్స్ ని అందుకున్నాడు నితిన్. ప్రస్తుతం నితిన్ “ఛలో” ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత “ఆర్ ఎక్స్ 100” ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తాడు.

అయితే ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే సుకుమార్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా ఒప్పుకున్నాడు నితిన్. అందుతున్న సమాచారం ప్రకారం “కుమారి 21F” దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ మధ్యనే ఒక కథని నితిన్ కి వినిపించడం, అది ఆయనకి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అయ్యింది అని తెలుస్తుంది.. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ తన నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ & GA2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయట. అసలైతే ఈ సినిమాలో మొదట రాజ్ తరుణ్ ని హీరోగా అనుకున్నారు, కానీ రాజ్ తరుణ్ కి ఆ డైరెక్టర్ కి పడకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా నితిన్ వద్దకు వచ్చి ఆగింది.