Telugu Global
Cinema & Entertainment

తెలుగు సినిమాలోకి కొత్త నిధి వచ్చింది

నిధి అగర్వాల్…ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న పేరు. కానీ హిందీ లో మాత్రం గత ఏడాది నుంచే ఈ పేరు హల్ చల్ చేస్తోంది. “మున్నా మైఖేల్” అనే హిందీ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మాత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న విడుదల అయిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ ని చూసి తెలుగు […]

తెలుగు సినిమాలోకి కొత్త నిధి వచ్చింది
X

నిధి అగర్వాల్…ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న పేరు. కానీ హిందీ లో మాత్రం గత ఏడాది నుంచే ఈ పేరు హల్ చల్ చేస్తోంది. “మున్నా మైఖేల్” అనే హిందీ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన నటించింది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మాత్రం అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న విడుదల అయిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ ని చూసి తెలుగు ప్రేక్షకులు ఫ్లాట్ అయినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ లో తనదైన మార్క్ వేసుకున్న ఈ సన్నజాజి టాలీవుడ్ లోనూ అదే రీతిలో రాణించి బడా హీరోయిన్ ల లిస్టులోకి వెళ్లాలని ప్రేక్షకులు కోరుతుండగా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు చూస్తే అదేమంత దూరంలో ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇకపోతే అన్నతో ఇటీవలే నటించిన ఈ అమ్మడు…. ఇప్పుడు తమ్ముడితో అంటే అఖిల్ అక్కినేని తో కలిసి “మిస్టర్ మజ్ను” సినిమాలో కూడా నటిస్తుంది.

వరుసగా ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి భామకి ఇతర హీరోల దగ్గరనుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట.

First Published:  3 Nov 2018 4:21 AM GMT
Next Story