Telugu Global
National

పోలవరం ప్రాజెక్టు వద్ద చీలిన భూమి.... కూలిన విద్యుత్ స్తంభాలు

పోలవరం ప్రాజెక్టు వద్ద అలజడి రేగింది. ఒక్కసారిగా ప్రాజెక్టు చెక్‌ పోస్టు సమీపంలో భారీగా పగుళ్లు వచ్చాయి. రోడ్లు చీలిపోయాయి. దీంతో పోలవరం వద్ద వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు వాహనాలను వదిలేసి పరుగులు తీశారు.  పగుళ్లు వచ్చిన ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ప్రాజెక్ట్ చెక్ పోస్టు వద్ద ఐదు అడుగుల మేర భూమి పైకి చొచ్చుకొచ్చింది. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఇంజనీర్లు అక్కడికి చేరుకుని పరిశీలన చేస్తున్నారు. […]

పోలవరం ప్రాజెక్టు వద్ద చీలిన భూమి.... కూలిన విద్యుత్ స్తంభాలు
X

పోలవరం ప్రాజెక్టు వద్ద అలజడి రేగింది. ఒక్కసారిగా ప్రాజెక్టు చెక్‌ పోస్టు సమీపంలో భారీగా పగుళ్లు వచ్చాయి. రోడ్లు చీలిపోయాయి. దీంతో పోలవరం వద్ద వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు వాహనాలను వదిలేసి పరుగులు తీశారు.

పగుళ్లు వచ్చిన ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రోడ్లు చీలిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ప్రాజెక్ట్ చెక్ పోస్టు వద్ద ఐదు అడుగుల మేర భూమి పైకి చొచ్చుకొచ్చింది.

విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఇంజనీర్లు అక్కడికి చేరుకుని పరిశీలన చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద భూకంపం వచ్చిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఈస్థాయిలో పగుళ్లు రావడం, ఏకంగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కారణాలు తేల్చే పనిలో ఇంజనీర్లు ఉన్నారు.

First Published:  3 Nov 2018 1:40 AM GMT
Next Story