Telugu Global
International

సానియా పుత్ర ఇజాన్ మీర్జా మాలిక్

మాతృత్వం కోసం టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకొన్న సానియా పుత్రోత్సాహంలో సానియా- షోయబ్ మాలిక్ జోడీ 2020 ఒలింపిక్స్ కు సిద్ధమంటున్న సానియా భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా… పండంటి బిడ్డతో ఇంటికి చేరింది. కొద్దిరోజుల క్రితమే…బంజారా హిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్…. తమకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మీర్జా మాలిక్ ముద్దు పేరుగా ఉన్న తన కుమారునికి […]

సానియా పుత్ర ఇజాన్ మీర్జా మాలిక్
X
  • మాతృత్వం కోసం టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకొన్న సానియా
  • పుత్రోత్సాహంలో సానియా- షోయబ్ మాలిక్ జోడీ
  • 2020 ఒలింపిక్స్ కు సిద్ధమంటున్న సానియా

భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా… పండంటి బిడ్డతో ఇంటికి చేరింది. కొద్దిరోజుల క్రితమే…బంజారా హిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్…. తమకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీర్జా మాలిక్ ముద్దు పేరుగా ఉన్న తన కుమారునికి …”ఇజాన్ మీర్జా మాలిక్” అన్న పేరు పెట్టినట్లు ప్రకటించారు. అరబిక్ భాషలో ”ఇజాన్” అంటే… ”దేవుడిచ్చిన వరం” అని అర్థం.

తొలి కానుపు కోసం టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకొన్న సానియా… టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ కు సిద్ధంకావాలని భావిస్తోంది. మాతృత్వం టెన్నిస్ కెరియర్ కు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాలన్నదే తన లక్ష్యమని సానియా గతంలోనే ప్రకటించింది.

సానియా కుమారుడంటూ సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఫోటోలు నిజమైనవి కావని…తాము అసలు ఫోటోనే ఇవ్వలేదని.. సానియా కుటుంబసభ్యులు చెబుతున్నారు.

బంజారా హిల్స్ లోని రెయిన్ బో ఆస్పత్రి నుంచి తన బిడ్డను పొత్తిళ్లలో ఉంచుకొని బయటకు వస్తున్న సానియా ఫోటోలు… అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించాయి.

First Published:  3 Nov 2018 6:29 AM GMT
Next Story