Telugu Global
Cinema & Entertainment

సవ్యసాచి ఫస్ట్ డే వసూళ్లు

నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాకు మొదటి రోజే వసూళ్లు పడిపోయాయి. సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్ కూడా పల్చగా చేయడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దానికి తగ్గట్టే మొదటి రోజు వసూళ్లు పేలవంగా వచ్చాయి. సవ్యసాచి సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో చూసుకుంటే 3 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నాగచైతన్య మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే […]

సవ్యసాచి ఫస్ట్ డే వసూళ్లు
X

నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాకు మొదటి రోజే వసూళ్లు పడిపోయాయి. సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్ కూడా పల్చగా చేయడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. దానికి తగ్గట్టే మొదటి రోజు వసూళ్లు పేలవంగా వచ్చాయి.

సవ్యసాచి సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో చూసుకుంటే 3 కోట్ల 25 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నాగచైతన్య మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే ఇది చాలా తక్కువ మొత్తం. ఎందుకంటే, ఈ సినిమా కంటే ముందు నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మొదటిరోజు 6 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

రిలీజ్ కు ముందు ఈ సినిమా 23 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఫస్ట్ వీకెండ్ (తొలి 3 రోజులు) గడిచేసరికి ఇందులో 60 శాతం ఎమౌంట్ వెనక్కి రావాలి. మొదటి రోజు వసూళ్లతో పోల్చి చూస్తే, ఈ సినిమాకు దాదాపు అన్ని ఏరియాల్లో నష్టాలు తప్పేలా లేవు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 1.05 కోట్లు

సీడెడ్ – రూ. 0.48 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.53 కోట్లు

ఈస్ట్ – రూ. 0.19 కోట్లు

వెస్ట్ – రూ. 0.17 కోట్లు

గుంటూరు – రూ. 0.46 కోట్లు

కృష్ణా – రూ. 0.23 కోట్లు

నెల్లూరు – రూ. 0.15 కోట్లు

First Published:  3 Nov 2018 5:45 AM GMT
Next Story