Telugu Global
Cinema & Entertainment

బన్నీ వద్దన్నాడు... నాని రమ్మన్నాడు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా దాదాపు ఫిక్స్ అయింది. అధికారికంగా సినిమాను ప్రకటించడమే ఆలస్యం.  అయితే ఈ మొత్తం వ్యవహారంలో విక్రమ్ కుమార్ కు మాత్రం దెబ్బ పడింది. త్రివిక్రమ్ సినిమా ఓకే అవ్వడంతో, విక్రమ్ ను మరోసారి పక్కనపెట్టాడు బన్నీ. ఈసారి విక్రమ్ కుమార్ వెయిట్ చేయదలుచుకోలేదు. తన దగ్గరున్న కథతో నానిని కలిశాడు. వచ్చిన వెంటనే విక్రమ్ కుమార్ ను ఆహ్వానించాడు నాని. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు కూడా ముగిశాయి. సినిమా దాదాపు […]

బన్నీ వద్దన్నాడు... నాని రమ్మన్నాడు
X

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా దాదాపు ఫిక్స్ అయింది. అధికారికంగా సినిమాను ప్రకటించడమే ఆలస్యం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విక్రమ్ కుమార్ కు మాత్రం దెబ్బ పడింది. త్రివిక్రమ్ సినిమా ఓకే అవ్వడంతో, విక్రమ్ ను మరోసారి పక్కనపెట్టాడు బన్నీ. ఈసారి విక్రమ్ కుమార్ వెయిట్ చేయదలుచుకోలేదు. తన దగ్గరున్న కథతో నానిని కలిశాడు.

వచ్చిన వెంటనే విక్రమ్ కుమార్ ను ఆహ్వానించాడు నాని. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు కూడా ముగిశాయి. సినిమా దాదాపు పక్కా అయినట్టే. కాకపోతే ఇన్నాళ్లూ బన్నీ కోసం రాసుకున్న కథతోనే నాని-విక్రమ్ కుమార్ సెట్స్ పైకి వెళ్లబోతున్నారా.. లేక నాని కోసం మరో ఫ్రెష్ సబ్జెక్ట్ రెడీ చేశాడా అనేది డౌట్.

ఈ సందేహాలు పక్కనపెడితే.. వీళ్లిద్దరూ కలిసి ఏ నిర్మాతకు సినిమా చేసి పెడతారనేది పెద్ద డౌట్. ఎందుకంటే విక్రమ్ కుమార్ వద్ద మంజుల, అశ్వనీదత్ లాంటి నిర్మాతల అడ్వాన్సులు ఉన్నాయి. ఇటు నాని, అశ్వనీదత్ కు ఓ సినిమా బాకీ ఉన్నాడు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అశ్వనీదత్ బ్యానర్ లో విక్రమ్ కుమార్, నాని సినిమా చేసే ఛాన్స్ ఉంది.

First Published:  2 Nov 2018 9:26 PM GMT
Next Story