“ఎన్టీఆర్” బయోపిక్ లో దాసరి నారాయణరావు గా వినాయక్ ?

నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. బాలక్రిష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎక్కువ హిట్స్ ఇచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు వచ్చాయి. కాబ‌ట్టి ఎన్టీఆర్ క‌థ‌ చెబుతూ దాస‌రికి చూపించాల్సిన అవ‌స‌రం వచ్చింది దర్శకుడు క్రిష్ కి. ఈ పాత్ర‌కు ఎవ‌రైతే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో క్రిష్ ఉండగా వినాయ‌క్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నిజానికి ఈ పాత్ర కోసం ముందు చంద్ర‌సిద్దార్థ్‌ని ఎంచుకుందామ‌నుకున్నారు. ఆయ‌న ఓకే కూడా చెప్పాడు. ఎందుక‌నో క్రిష్ ఆ ఆలోచ‌న నుంచి డ్రాప్ అయ్యి ఇప్పుడు ఈ పాత్రకి వినాయక్ అయితేనే సెట్ అవుతుంది అనుకుంటున్నాడు అంట. ఇకపోతే బాలక్రిష్ణ తో ఒక సినిమా డైరెక్ట్ చేయాలి వినాయక్, మధ్యలో “ఎన్టీఆర్” బయోపిక్ రావడంతో ఆ సినిమా కాస్త హోల్డ్ లో పడింది. మరి ఇప్పుడు ఇంకా తన సినిమాకి టైం ఉంది అని తెలిసిన వినాయక్ ఈ సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి.