పది కోట్ల ఆఫర్ అందుకున్న పరశురాం.

“గీత గోవిందం” ముందు వరకు డైరెక్టర్ గా పరశురాం పేరు చాలా మందికి తెలియదు. అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు పరశురాం ఒక మామూలు ఆవరేజ్ దర్శకుడు మాత్రమే, కానీ “గీత గోవిందం” రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తరువాత పరశురాం రేంజ్ మారిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే పరశురాం ఇప్పుడు స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.

అయితే ఇప్పుడు పరశురాం కి ఒక స్టార్ ప్రొడ్యూసర్ దాదాపు పది కోట్ల దాక ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అందులో నుంచి సగం డబ్బు అడ్వాన్సు గా కూడా ఇచ్చినట్టు టాక్. పరశురాం స్టార్ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆ డబ్బుని వైజాగ్ ఏరియా లో రియల్ ఎస్స్టేట్ లో పెట్టాడట. ఇండస్ట్రీ లో ఎవరి పరిస్థతి ఎప్పుడూ ఒక లాగ ఉండదని గ్రహించి పరశురాం ఈ పని చేసినట్టు తెలుస్తుంది. కానీ పరశురాం కెరీర్ లో ఇంత పారితోషకం తీసుకోవడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన తదుపరి సినిమా కథ చర్చల్లో బిజీగా ఉన్నాడు పరశురాం. మరి పరశురాం కి అడ్వాన్సు ఇచ్చిన ఆ నిర్మాత ఎవరు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.