Telugu Global
Cinema & Entertainment

ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యడం నితిన్ కి ఇష్టం లేదా ?

నితిన్ కి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. అదేంటి అంటే వరుస ఫ్లాప్స్ తో తన కెరీర్ మళ్ళీ వెనక్కి వేళ్ళిపోతుందేమో అని. అందుకే ఇప్పుడు నితిన్ ప్రతి ఒక్క సినిమాని ఆచి తూచి  ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” అనే సినిమా చేస్తున్నాడు నితిన్. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి తో ఒక సినిమా చేస్తున్నాడు. […]

ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యడం నితిన్ కి ఇష్టం లేదా ?
X

నితిన్ కి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. అదేంటి అంటే వరుస ఫ్లాప్స్ తో తన కెరీర్ మళ్ళీ వెనక్కి వేళ్ళిపోతుందేమో అని. అందుకే ఇప్పుడు నితిన్ ప్రతి ఒక్క సినిమాని ఆచి తూచి ఒప్పుకుంటున్నాడు.

ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” అనే సినిమా చేస్తున్నాడు నితిన్. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత అజయ్ భూపతి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యాలి నితిన్. కానీ ఇప్పుడు ఆ సినిమాని పక్కన పెట్టి “కుమారి 21 ఎఫ్” ఫేం సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ నిర్మాతగ ఒక సినిమా చేస్తున్నాడు.

నితిన్ ఎంచుకున్న లైన్ అప్ చూస్తుంటే నితిన్ కి యేలేటి తో సినిమా చెయ్యడం ఇష్టం లేదా అనే అనుమానం రాక మానదు. ఇదివరకు నాని కూడా చంద్ర శేఖర్ యేలేటి సినిమా చేద్దాం అనుకొని మధ్యలో వదిలేశాడు. ఇప్పుడేమో నితిన్ ఇలా చేస్తున్నాడు. మరి యేలేటి స్క్రిప్ట్ కి ఏ హీరో దొరుకుతాడో చూడాలి.

First Published:  4 Nov 2018 4:02 AM GMT
Next Story