Telugu Global
National

అజర్ గంట మోత తో గౌతం గంభీర్ కు తంటా

టీమిండియా నెగ్గినా బీసీసీఐ ఓడిందంటూ ట్వీట్ ఈడెన్ గార్డెన్స్ లో గంట మోగించిన మహ్మద్ అజరుద్దీన్ ఈడెన్ గార్డెన్స్ తో అజర్ కు ప్రత్యేక అనుబంధం… భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి సంకేతంగా… గంట మోగించే గౌరవాన్ని మహ్మద్ అజరుద్దీన్ కు బీసీసీఐ కల్పించింది. తనకు ఎంతగానో అచ్చివచ్చిన గ్రౌండ్ మాత్రమే కాదు…తన రికార్డులకు […]

అజర్ గంట మోత తో గౌతం గంభీర్ కు తంటా
X
  • టీమిండియా నెగ్గినా బీసీసీఐ ఓడిందంటూ ట్వీట్
  • ఈడెన్ గార్డెన్స్ లో గంట మోగించిన మహ్మద్ అజరుద్దీన్
  • ఈడెన్ గార్డెన్స్ తో అజర్ కు ప్రత్యేక అనుబంధం…

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా విండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభానికి సంకేతంగా… గంట మోగించే గౌరవాన్ని మహ్మద్ అజరుద్దీన్ కు బీసీసీఐ కల్పించింది.

తనకు ఎంతగానో అచ్చివచ్చిన గ్రౌండ్ మాత్రమే కాదు…తన రికార్డులకు వేదికగా నిలిచిన ఈడెన్ గార్డెన్స్ లో…గంట కొట్టి ఓ అంతర్జాతీయ మ్యాచ్ ను ప్రారంభించే అవకాశాన్ని అజర్ తిరిగి సంపాదించుకోగలిగాడు. ఎందరో క్రికెట్ దిగ్గజాల సాక్షిగా గంట మోగించడం ద్వారా మ్యాచ్ ను ప్రారంభించాడు.

ఆ తర్వాత హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల విజయం సాధించడం ద్వారా ఊపిరి పీల్చుకో గలిగింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే…. టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ చేసిన ట్వీట్ మాత్రం కలకలం రేపింది.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం బహిష్కరణకు గురైన ఓ క్రికెటర్ కు…. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ లో గంట మోగించే అరుదైన గౌరవాన్ని ఎలా కల్పిస్తారంటూ…బీసీసీఐ పైన గౌతం గంభీర్ మండిపడ్డాడు.

కోల్ కతా టీ-20 మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచినా…. వివాదాస్పద అజరుద్దీన్ ను గంట మోగించడానికి అనుమతించడం ద్వారా… బీసీసీఐ పాలకమండలి పరాజయం పాలయ్యిందంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

మహ్మద్ అజరుద్దీన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతితో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో పోటీకి దిగినా… గంట మోగించడానికి అనుమతించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదని గంభీర్ సమర్థించుకొన్నాడు.

మహ్మద్ అజరుద్దీన్ తన కెరియర్ లో ఆడిన మొత్తం 99 టెస్టుల్లో…47 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. 6వేల 215 పరుగులు సాధించాడు. అంతేకాదు..334 వన్డేల్లో 9 వేల 378 పరుగులు నమోదు చేశాడు.

భారత క్రికెట్ అందించిన అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా, హైదరాబాదీ మణికట్టు మాంత్రికుడిగానూ అజర్ గు గుర్తింపు ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజర్ …క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యాయపోరాటంలో గెలిచినా… బీసీసీఐ నుంచి క్లీన్ చిట్ సాధించలేకపోయాడు.

First Published:  5 Nov 2018 4:16 AM GMT
Next Story